Telugu Gateway
Top Stories

సింగపూర్ ఎయిర్ లైన్స్ నంబర్ వన్

సింగపూర్ ఎయిర్ లైన్స్ నంబర్ వన్
X

ప్రపంచంలో టాప్ టెన్ ఎయిర్ లైన్స్ ఏంటో తెలుసా?. 2023 సంవత్సరానికి సంబంధించి స్కై ట్రాక్స్ మరో సారి ఈ జాబితా విడుదల చేసింది. పారిస్ ఎయిర్ షో లో ఈ వార్షిక పోల్ వివరాలను బహిర్గతం చేశారు. దీని ప్రకారం సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రపంచంలోనే నంబర్ వన్ ఎయిర్ లైన్స్ గా నిలిచింది. సెకండ్ ప్లేస్ లో ఖతార్ ఎయిర్ లైన్స్, అల్ నిప్పాన్ ఎయిర్ లైన్స్, ఎమిరేట్స్, జపాన్ ఎయిర్ లైన్స్, టర్కిష్ ఎయిర్ లైన్స్, ఎయిర్ ఫ్రాన్స్ , క్యాథే పసిఫిక్, ఎవ ఎయిర్, కొరియన్ ఎయిర్ లైన్స్ ఉన్నాయి. టాప్ ట్వంటీ లో భారత్ నుంచి ఒకే ఒక ఎయిర్ లైన్స్ చోటు దక్కించుకుంది. అదే విస్తార ఎయిర్ లైన్స్. దీనికి 16 వ ప్లేస్ దక్కింది.

భారత్ కు చెందిన మరో ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగో లో కాస్ట్ ఎయిర్ లైన్స్ లో మూడవ ప్లేస్ సాధించింది. స్కై ట్రాక్స్ మొత్తం మీద వంద ఎయిర్ లైన్స్ జాబితాను విడుదల చేసింది. నిష్పక్షపాతంగా ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ నివేదిక సిద్ధం చేసినట్లు కంపెనీ చెపుతోంది. అమెరికా కు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ 20 వ ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బ్రిటిష్ ఎయిర్ వేస్ 18 వ ప్లేస్ లో ఉంది. మొత్తం మీద రెండు కోట్ల మంది ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు తీసుకుని ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు.

Next Story
Share it