Telugu Gateway
Top Stories

దిశా రవికి బెయిల్ మంజూరు

దిశా రవికి బెయిల్ మంజూరు
X

దేశంలో కలకలం సృష్టించిన టూల్ కిట్ కేసులో అరెస్ట్ అయిన దిశా రవికి బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. దేశంలో పెద్ద ఎత్తున సాగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా ట్వీట్ చేసిన స్వీడన్ కు చెందిన పర్యావరణ వేత్త గ్రెటా థెన్ బెర్గ్ షేర్ చేసిన టూల్ కిట్ ను రూపొందించటంలో సామాజిక కార్యకర్తగా ఉన్న దిశా రవికి కూడా పాత్ర ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు.

దిశా రవితోపాటు నికితాజాకబ్, శంతను ములుక్ లకు సంబంధం ఉందని పోలీసులు కోర్టుకు నివేదించారు. టూల్ కిట్ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 13న పోలీసులు బెంగుళూరులో దిశా రవిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దిశా రవి అరెస్ట్ పై దేశంలో ప్రతిపక్షాలు కూడా కేంద్ర సర్కారు తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. మొత్తం నాలుగు రోజులు పోలీస్ కస్టడీలో దిశా రవి ఉన్నారు.

Next Story
Share it