సెమీస్ లో సింధు ఓటమి

పీ వీ సింధు. ఒలంపిక్స్ లో ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ ల్లో దూకుడు చూపించింది. అయితే సెమీస్ లో మాత్రం ప్రత్యర్ధి దూకుడు ముందు మాత్రం నిలబడలేకపోయింది. గత ట్రాక్ రికార్డు చూసినా కూడా తై జుయింగ్ చేతిలో పలుమార్లు పరాజయం పాలైంది సింధు. మరి ఆ భయం వెంటాడుతుందో..లేక కారణాలేంటో తెలియదు కానీ ఇప్పటివరకూ దూకుడు చూపించిన సింధు కు నిరాశే ఎదురైంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత షట్లర్ పీవీ సింధు రెండు సెట్లను కోల్పోయింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకువచ్చిన సింధు.. తైజుయింగ్(చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది.
వరుస గేమ్‌లలో సింధుపై ఒత్తిడి పెంచిన తైజు.. 21-18, 21-12 తేడాతో సింధును ఓడించింది. ఎట్టకేలకు తొలి ఒలింపిక్ పతక వేట బరిలో తైజు నిలవగా... పీవీ సింధు ఫైనల్ చేరకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. అయితే సింధు కాంస్య పతకం దక్కించుకునేందుకు మరో ఛాన్స్ ఉంది. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు జరిగే పోటీలో చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో పోటీపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే కాంస్య పతకం దక్కనుంది. తైజుయింగ్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకులో ఉంది.