Telugu Gateway
Top Stories

కొత్త మోడల్ పన్ను ఎగవేత!

కొత్త మోడల్ పన్ను ఎగవేత!
X

చాయ్ తాగినా..సిగరెట్ కొనుగోలు చేసినా ఫోన్ తీసి షాప్ ముందు ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి పేమెంట్ చేసేయ్యటమే. చాలా మంది ఇప్పుడు అసలు జేబులో డబ్బులు పెట్టుకోవటమే మానేశారు. ఎందుకంటే ఎక్కడైనా సరే చెల్లింపులు అన్ని డిజిటల్ మోడ్ లోకి వచ్చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే పన్ను చెల్లింపుల్లో మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎంత పారదర్శక విధానాలు తెస్తున్నా వాటిని ఎలా స్కిప్ చేయవచ్చో కూడా వ్యాపారులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తుంటారు. అలాంటిదే ఈ ఘటన. హొస్కట్. బెంగళూరు రురల్ జిల్లాలోని ప్రముఖ ప్రాంతం. బిర్యానీ ప్రియులకు ఇది ఎంతో ఇష్టమైన ప్రాంతం. లేట్ నైట్స్ తో పాటు వేకువ జాములో కూడా బిర్యానీ తినాలంటే ఇక్కడ దొరుకుంది.

బిర్యానీ ప్రేమికులకు ఇది ఎంతో ఇష్టమైన ప్రదేశం అని చెప్పొచ్చు. ఇక్కడ వ్యాపారం కూడా అదే రేంజ్ లో ఉంటుంది. వీళ్ళు పెద్ద ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు సమాచారం రావటంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు దాడులు చేసి జీఎస్టీ చెల్లింపుల్లో ఎగవేతలు ఉన్నట్లు గుర్తించారు. ఒక బిర్యానీ షాప్ లో ఏకంగా 30 యూపీఐ క్యూఆర్ కోడ్స్ కనిపెట్టారు అంటే వివిధ అకౌంట్స్ లో చెల్లింపులు చేయించుతూ వీరు తక్కువ టర్నోవర్ చూపిస్తున్నారు. ఈ దాడుల్లోనే ఒక షాప్ యజమాని ఇంటి నుంచి 1 .47 కోట్ల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

Next Story
Share it