Telugu Gateway
Top Stories

ప్రకృతి మధ్యలో అద్భుత ఆలయం ( Manali Hidimba Temple Story)

ప్రకృతి మధ్యలో అద్భుత ఆలయం ( Manali Hidimba Temple Story)
X

సమ్మర్ లో ఎక్కువ మంది దేశంలో చల్లగా ఉండే ప్రాంతాల్లో పర్యటించడానికి ఆసక్తి చూపుతారు. దీని ద్వారా ఎండాకాలం నుంచి కొన్ని రోజులు తప్పించుకొనే ఛాన్స్ దక్కుతుంది..అదే సమయంలో కొత్త ప్రాంతాలను చూసిన అనుభూతి కూడా మిగులుతుంది. మందు వేసవిలో కూడా వణుకు పుట్టించే చలి ఉండే ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి ఒకటి. ఇక్కడా ఎన్నో ప్రకృతి రమణీయ దృశ్యాలతో పాటు చారిత్రిక ప్రాధాన్యత ఉన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి హిడింబా దేవి ఆలయం. భీముడి భార్య అయిన హిడింబికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ పురాతన గుహాలయం ఇది. దట్టమైన ధుంగిరి దేవదారు అడవుల మధ్య, మనాలీ మాల్ రోడ్డుకు అతి సమీపంలో ఈ ఆలయం ఉంటుంది. అందుకే ఈ హిడింబా దేవిని వనదేవత, ప్రకృతి దేవత అని పిలుస్తారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు స్థానికులు ఈ దేవతకు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తుంటారు.

ఈ ఆలయాన్ని 1553లో మహరాజా బహదూర్ సింగ్ నిర్మించారు. చెక్కలతో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం అడవుల మధ్య ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. మహాభారతంతో ఈ ఆలయానికి ప్రత్యేక సంబంధం ఉంది. అరణ్యవాసంలో భాగంగా పాండవులు ఈ ప్రదేశంలో కొద్ది రోజులు ఉన్నారు అని చెపుతారు. ఆ సమయంలోనే ఈ ప్రాంతంలో ఉండే రాక్షసుడు హిడింబాసురుడు వాళ్ల వివరాలు కనుక్కోమని తన చెల్లి హిడింబను పంపుతాడు. అయితే రాత్రి వేళ అక్కడ కాపలాగా ఉన్న భీమున్ని చూసి హిడింబ ప్రేమలో పడుతుంది. తన అన్న వలన మీకు అపాయం పొంచి ఉందని భీమున్ని హెచ్చరిస్తుంది.

అయితే తరువాత జరిగిన యుద్ధంలో భీముడు హిడింబాసురున్ని అంతమొందిస్తాడు. తర్వాత హడింబ తన ప్రేమను భీమునికి వ్యక్తపరిచి తనను వివాహం చేసుకోవాలని కోరుతుంది. అయితే ఇక్కడ తాము కొంతకాలమే ఉంటామని, కాబట్టి ఇక్కడ ఉన్నత కాలం మాత్రమే నీతో ఉండగలనని భీముడు షరతు విధించడంతో హిడింబ దానికి అంగీకరించి తన ప్రేమను సఫలం చేసుకుంటుంది. భీముని కారణంగానే హడింబకు ఘటోత్కచుడు జన్మిస్తాడు. మహాభారత యుద్ధంలో తండ్రి భీముడి ఆదేశం మేరకు యుద్ధానికి దిగి తన ప్రాణాలనే అర్పించిన ఘటోత్కచుడి చరిత్ర తెలిసిందే. హిడింబ, ఘటోత్కచుడు రాక్షస జాతికి చెందిన వారు అయినా ఎప్పుడూ ఎవ్వరికీ హాని తలపెట్టకుండా, ధర్మం వైపు నిలబడడంతో వారు కూడా దేవతలుగానే కొలవబడుతున్నారు.

Next Story
Share it