Telugu Gateway
Top Stories

నాలుగు నెలల్లోనే థాయిలాండ్ కు 1 .20 కోట్ల మంది

నాలుగు నెలల్లోనే థాయిలాండ్ కు 1 .20 కోట్ల మంది
X

పర్యాటకులకు గుడ్ న్యూస్. భారత్ తో పాటు తైవాన్ ప్రజలకు కూడా ఉచిత వీసా గడువును నవంబర్ 11 వరకు పొడిగిస్తూ ప్రముఖ పర్యాటక దేశం అయిన థాయిలాండ్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించటం ద్వారా దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆ దేశం ఇచ్చిన ఉచిత వీసా గడువు ముగిసిపోవటంతో ఇప్పుడు ఈ నిర్ణయం వెలువడింది. గతంలో వీసా ఆన్ అరైవల్ కింద ఆ దేశంలో పదిహేను రోజులు పర్యటించడానికి అనుమంతించేవారు.

ఇప్పుడు ఈ ఉచిత వీసా విధానం కింద 30 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించవచ్చు. ఈ ఏడాది తొలి నాలుగు నెలల కాలంలోనే థాయిలాండ్ కు పర్యటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఇదే కాలం కంటే 2024 మొదటి నాలుగు నెలల కాలంలో 39 శాతం పెరుగుదలతో పన్నెండు మిలియన్స్ అంటే కోటి ఇరవై లక్షల మంది పర్యాటకులను ఆకర్షించింది థాయిలాండ్. ఇందులో ఎక్కువ మంది చైనా తో పాటు ఇండియా, మలేసియా, రష్యా, దక్షిణ కొరియా వాళ్ళు ఉన్నారు.

Next Story
Share it