Telugu Gateway
Top Stories

'టెలోసా' న‌వ న‌గ‌ర నిర్మాణం!

టెలోసా  న‌వ న‌గ‌ర నిర్మాణం!
X

అక్క‌డ ప్ర‌స్తుతానికి ఏమీ లేదు. కానీ అద్భుతాలు ఆవిష్క‌రించాల‌ని నిర్ణ‌యించారు. ప‌ట్ట‌ణ నివాసంలో ప్ర‌పంచ శ్రేణి ప్ర‌మాణాలు నెల‌కొల్ప‌బోతున్నారు. అయితే అది అంతా ఆషామాషీగా జ‌రిగే వ్య‌వ‌హ‌రం కాదు. దీనికి ఎంతో శ్ర‌మ‌, పెట్టుబడి కూడా కావాలి. అయినా స‌రే త‌న క‌ల‌ల ప్రాజెక్టును చేప‌ట్ట‌డానికి రెడీ అయ్యారు అమెరికాకు చెందిన బిలియనీర్, మాజీ వాల్ మార్ట్ ఎగ్జిక్యూటివ్ మార్క్ లోర్. 400 బిలియ‌న్ల అమెరికా డాల‌ర్ల‌తో 'టెలోసా' పేరుతో ఓ కొత్త న‌గ‌రాన్ని నిర్మించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టిటంచారు. ఈ న‌గ‌రానికే టెలోసా (Telosa) అనే పేరు పెట్టారు. 1,50,000 ఎక‌రాల్లో నిర్మించ‌నున్న ఈ సిటీ నుంచి అక్క‌డ నివాసం ఉండే వారు కేవ‌లం ప‌దిహేను నిమిషాల్లో త‌మ ప‌ని ప్ర‌దేశాల‌కు వెళ్లేలా ఏర్పాట్లు చేయ‌బోతున్నారు.

అంతేకాదు..అక్క‌డే వ్య‌వ‌సాయం చేసుకునే వెసులుబాట్లు కూడా ఉంటాయి. హైస్పీడ్ ట్రాన్స్ పోర్టేష‌న్, ఇంథ‌న సామ‌ర్ధ్య భ‌వ‌నాలు ఇక్క‌డ ప్ర‌త్యేక‌త‌లుగా ఉండ‌బోతున్నాయి. అంతే కాదు 2030 నాటికి ఇక్క‌డ నివాసం ఉండేందుకు వీలుగా ప్ర‌జ‌ల‌ను ఆహ్వానించ‌నున్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే షెంజెన్ త‌ర‌హా మెట్రోపోలిస్ న‌గ‌రం రూపుదిద్దుకోనుంది. 2060 నాటికి ఇక్క‌డ ఏకంగా 50 ల‌క్షల మంది నివాసం ఉండేలా తీర్చిదిద్ద‌నున్నారు. ముఖ్యంగా ఏ మాత్రం ఉప‌యోగం లేని భూములను తీసుకుని ఈ ప్రాజెక్టు చేప‌ట్ట‌నున్నారు. అరిజోనా ఏడాది ప్రాంతంలో ఇది రూపుదిద్దుకోనుంది.

Next Story
Share it