Telugu Gateway

అంత‌రాష్ట్ర బ‌స్ స‌ర్వీసుల‌కు తెలుగు రాష్ట్రాలు రెడీ

అంత‌రాష్ట్ర బ‌స్ స‌ర్వీసుల‌కు తెలుగు రాష్ట్రాలు రెడీ
X

సోమ‌వారం నుంచి తెలంగాణ‌-ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య అంత‌రాష్ట్ర బ‌స్సు స‌ర్వీసులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ‌లో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయ‌గా..ఏపీలో మాత్రం ఉద‌యం ఆరు గంట‌ల నుంచి సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు మాత్రం స‌డ‌లింపులు ఇచ్చారు. ఈ స‌డ‌లింపులకు అనుగుణంగా బ‌స్సులు న‌డిపేందుకు రెండు రాష్ట్రాలు రెడీ అయ్యాయి. తెలంగాణ ఆర్టీసీతో పాటు ఏపీఎస్ఆర్టీసీ లు ఈ మేర‌కు ప్ర‌క‌ట‌నలు చేశాయి.

ప్ర‌యాణికుల‌కు ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ సౌల‌భ్యం కూడా అందుబాటులోకి తెచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్యే కాకుండా టీఎస్ఆర్టీసీ క‌ర్ణాట‌క‌కు కూడా బ‌స్సు స‌ర్వీసులు ప్రారంభించ‌నుంది. బెంగుళూరుకు మాత్రం బ‌స్సులు ఉండ‌వు. ఆ రాష్ట్రంలో ఉన్న నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఈ స‌ర్వీసులు ఉంటాయి.

Next Story
Share it