'తేజస్ ఎక్స్ ప్రెస్ రైళ్ళు'..ఫిబ్రవరి 14 నుంచి పట్టాలపైకి
BY Admin30 Jan 2021 9:58 PM IST
X
Admin30 Jan 2021 9:58 PM IST
అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 'తేజాస్ ఎక్స్ రెస్ రైళ్ళు' మళ్ళీ పట్టాలెక్కనున్నాయి. ఇంత కాలం కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ రైళ్ళు ఫిబ్రవరి 14న ప్రారంభం కానున్నాయి. లక్నో-న్యూఢిల్లీ, అహ్మదాబాద్-ముంబయ్ ల మధ్య ఈ రైళ్ళు నడవనున్నాయి.
ప్రయాణికులకు తమ సేవలు అందించటానికి ఇవి సిద్ధం అవుతున్నాయని రైల్వే శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఉన్న తరహాలోనే ఈ రైళ్లలో కూడా ప్రతి సీటుకు టీవీలు అమర్చటంతోపాటు వైఫై సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. 2017 మే 24న దేశంలో ఈ సర్వీసులు ప్రారంభం అయ్యాయి.
Next Story