Telugu Gateway
Top Stories

టాటా పంచ్..మైక్రో ఎస్ యూవీ వ‌చ్చేసింది

టాటా పంచ్..మైక్రో ఎస్ యూవీ వ‌చ్చేసింది
X

పండ‌గ‌ల సీజ‌న్ వ‌స్తోంది. కొత్త కొత్త కార్లు కూడా వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌ముఖ ఆటోమొబైల్ సంస్థ మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా (ఎంఅండ్ఎం) ఎస్ యూవీ 700ను మార్కెట్లోకి విడుద‌ల చేసింది. ఇప్పుడు తాజాగా టాటా సంస్థ కూడా ఈ జాబితాలో చేరింది. ఈ సంస్థ సోమ‌వారం నాడు టాటా మైక్రో ఎస్‌యూవీ పంచ్ కారును విడుదల చేసింది. ఇది ఆల్ఫా-ఎఆర్ సీ(ఎజిల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్) ఫ్లాట్ ఫారంపై ఆధారపడి పనిచేస్తుంద‌ని సంస్థ వెల్ల‌డించింది. టాటా మోటార్స్ కార్ల‌లో చాలా పాపులర్ మోడల్ ఆల్ట్రోజ్ తరహాలోనే దీనిని అభివృద్ధి చేశారు. ఆసక్తి గల కొనుగోలుదారులు టాటా మోటార్స్ డీలర్ల ద‌గ్గ‌ర లేదా కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో 21,000 రూపాయ‌లు చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చ‌ని తెలిపారు. టాటా మోటార్స్ పంచ్ కోసం వర్చువల్ షోరూమ్ కూడా ప్రారంభించింది. మైక్రో ఎస్‌యూవీ పంచ్ కారు ధరలను సంస్థ ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది. టాటా పంచ్ వేరియంట్ బట్టి 15 లేదా 16 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ పై నడుస్తుంది.

దీనిలో కమాండింగ్ డ్రైవింగ్ పొజిషన్, 187మి.మి గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. టాటా పంచ్ 1.2-లీటర్ రీవోట్రాన్ ఇంజిన్ డైనా-ప్రో టెక్నాలజీతో వస్తుంద‌న్నారు. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. బురద లేదా తక్కువ ట్రాక్షన్ ఉపరితలాల గుండా సులభంగా డ్రైవింగ్ చేయడం కోసం ఎఎమ్‌టి గేర్ బాక్స్ తో ఈ వాహ‌నం అందుబాటులోకి వస్తుంది. ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంపొందించడం కోసం సిగ్నల్స్, ట్రాఫిక్ వద్ద ఇంజిన్ ని ఆటోమేటిక్ గా ఆఫ్ చేయడం కోసం ఐడిల్ స్టార్ట్ స్టాప్, క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్లు ఉన్నాయి. టాటా పంచ్ ఇంటీరియర్స్ చాలా విశాలమైన ఫీల్ ఇచ్చేవిధంగా డిజైన్ చేశారు. డ్యాష్ బోర్డ్ 4 అంగుళాల లేదా 7 అంగుళాల హర్మన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో వస్తుంది. టాటా పంచ్ వెనుక సీట్లు చాలా సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తాయని కంపెనీ తెలిపింది.

Next Story
Share it