మోడీ రాజీ పడ్డారు..రాహుల్ తీవ్ర విమర్శలు

గత కొన్ని రోజులుగా భారీ నష్టాలు చవిచూస్తున్న స్టాక్ మార్కెట్ మంగళవారం నాడు దూసుకెళ్ళింది . ఫిబ్రవరి 1 న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ ఏమైనా మార్కెట్ కు దశ...దిశా నిర్దేశం చేస్తుంది అనుకుంటే బడ్జెట్ రోజు కూడా మార్కెట్లు కుప్పకూలాయి. ఈ దశలో ఎవరూ ఊహించని విధంగా సోమవారం రాత్రి అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ నుంచి సుంకాల తగ్గింపు ప్రకటన రావటం...దాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వాగతించటంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ లో సెంటిమెంట్ మెరుగైంది. దీంతో మంగళవారం ఉదయం నుంచి క్లోజింగ్ వరకు మార్కెట్లు దుమ్మురేపాయి. బిఎస్ఈ సెన్సెక్స్ 2072 పాయింట్ల లాభంతో 83,739 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ లో కూడా ఇదే ట్రెండ్ కనపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 639 పాయింట్ల లాభంతో 25727 పాయింట్ల వద్ద ముగిసింది. ఆ రంగం ...ఈ రంగం అన్న తేడా లేకుండా మెజారిటీ షేర్లు లాభాలతోనే ముగిశాయి.



