పొలిటికల్ ట్విస్ట్ లు చూస్తున్న విజయ్

టీవీకే అధినేత విజయ్ ఇప్పటి వరకు సినిమాల్లోనే ట్విస్ట్ లు...టర్న్ లు చూశారు. రాజకీయాల్లో ట్విస్ట్ లు ఎలా ఉంటాయో ఆయనకు ఇప్పుడు అవగతం అవుతున్నట్లు కనిపిస్తోంది. అతి పెద్ద పార్టీ గా అవతరించిన తాము ఇక ప్రమాణస్వీకారం చేయటం మిగిలింది అనుకున్న టీవీకే కు ఊహించని రీతిలో గవర్నర్ నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. గత రెండు రోజులుగా తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటుంటూనే ఉన్నాయి. గురువారం నాడు టీవీకే అధినేత విజయ్ మరో సారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్ తో భేటీ అయినా కూడా ప్రమాణస్వీకారం విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు చూపిస్తేనే ప్రమాణస్వీకారం ఉంటుంది అని ఆయన తేల్చిచెప్పారు.
గురువారం విజయ్ గవర్నర్ తో భేటీ అనంతరం రాజ్ భవన్ అధికారికంగా ఈ విషయం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడినంత మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అని...టీవీకే ఎమ్మెల్యేల మద్దతు విషయంలో వివరాలు సమర్పించలేదు అన్నారు. దీంతో తమిళనాడు లో ఈ అనిశ్చితి మరికొన్ని రోజులు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి రెండవసారి గవర్నర్ తో విజయ్ భేటీ అయిన వెంటనే ప్రమాణస్వీకారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు అని లోక్ భవన్ ప్రకటనలో తేలిపోయింది. తమిళనాడు ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేత గురువారం ఉదయం తమిళనాడు సీఎం గా ప్రమాణస్వీకారం చేయటానికి ముహూర్తం నిర్ణయించుకుని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే మేజిక్ ఫిగర్ కు కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల జాబితా తనకు సమర్పించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇస్తాననని గవర్నర్ చెప్పటంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. టీవీకే సొంతంగా 108 సీట్లు గెలుచుకోగా...ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా విజయ్ కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
గురువారం నాడు విజయ్ మరో సారి తమిళనాడు గవర్నర్ ను కలిసి అతి పెద్ద పార్టీ అయిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి అని...సభలో బల నిరూపణ చేసుకుంటామని చెప్పినా కూడా గవర్నర్ ఇందుకు నో చెప్పారు. బలనిరూపణ చేసుకోవాల్సింది సభలో కానీ..గవర్నర్ దగ్గర కాదు...గవర్నర్ తీరు ఏ మాత్రం సరికాదు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గవర్నర్ విజయ్ ప్రమాణస్వీకారణకి బ్రేకులు వేయటం తమిళనాడులో పెద్ద ఎత్తున దుమారానికి కారణం అవుతోంది. ముఖ్యంగా విజయ్ ఫాన్స్, యువత గవర్నర్ నిర్ణయానికి నిరసనగా మెరీనా బీచ్ లో మానవహారం తలపెట్టాలని సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టారు. దీంతో పోలీస్ అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. మరో వైపు డీఎంకే అధినేత స్టాలిన్ తమ మిత్రపక్షాలతో సమావేశం అయ్యారు. విజయ్ పార్టీ కి మద్దతు ఇచ్చే విష



