భార్య కోసం 'తాజ్ మహల్' లాంటి ఇళ్లు కట్టించాడు
ప్రపంచ ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటి. ఎవరికైనా తాజ్ మహల్ లాంటి ఇళ్లు ఉంటే. ఆ కిక్కే వేరు. అయితే షాజహన్ తన భార్య ముంతాజ్ పై ప్రేమతో ఈ చారిత్రక కట్టడం కట్టించిన విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆ రేంజ్ లో కాకపోయినా తన భార్య కోసం అచ్చం తాజ్ మహల్ ను పోలిన ఇళ్లు కట్టించాడు ఆ భర్త. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోను బుర్హాన్ పూర్ లో జరిగింది. ఈ ఇంటి నిర్మాణం కోసం మూడేళ్ల సమయం పట్టింది. ఆ ఇంటి డోమ్ 29 అడుగుల ఎత్తులో ఉంటుంది. నాలుగు పడకగదులతో దీన్ని నిర్మించారు.
అంతే కాదు ఇందులో లైబ్రరీతోపాటు మెడిటేషన్ గది కూడా ఉంది. రాజస్థాన్ నుంచి మక్రానా మార్బుల్స్ తెప్పించి మరీ ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు ఈ తాజ్ మహల్ తరహా ఈ ఇంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలు జాతీయ పత్రికలు దీనిపై కథనాలు ప్రచురించాయి. భార్య కోసం ఈ ప్రత్యేక ఇంటిని కట్టించిన వ్యక్తి పేరు ఆనంద్ ప్రకాష్ చోక్సి. ఈ జంట తాజ్ మహల్ ను సందర్శించి అక్కడకు ఇంజనీర్లను తీసుకెళ్ళి అంతా సేమ్ టూ సేమ్ దింపేశారు. మరి ఇప్పుడు ఎంత మంది భర్తలకు ఇలాంటి డిమాండ్లు వస్తాయో వేచిచూడాల్సిందే.