తాజ్ మహల్..ఇక రాత్రి అందాలూ చూడొచ్చు

రాత్రి వేళ తాజ్ మహల్ అందాలను చూడాలనుకుంటున్నారా?. మీ కొరిక ఇప్పుడు తీర్చుకోవచ్చు. ఏడాదికిపైగానే నిలిచిపోయిన రాత్రి వేళ సందర్శనను మళ్ళీ పునరుద్దరించారు. అయితే ఒక్కో స్లాట్ కు పరిమిత సంఖ్యలోనే పర్యాటకులను అనుమతించనున్నారు. ఆగస్టు 21 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. పున్నమి రాత్రి ఈ పాలరాతి ప్రేమ చిహ్నన్ని చూడటానికి ఎంతో మంది ఇష్టపడతారు. దీని కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. పర్యాటకులకు ఇప్పుడు మూడు స్లాట్స్ కేటాయించారు.
అందులో 8.30 గంటల నుంచి 9 గంటల వరకూ, 9 గంటల నుంచి 9.30 గంటల వరకూ, 9.30 గంటల నుంచి 10 గంటల వరకూ పర్యాటకులను అనుమతించనున్నారు. ప్రతి స్లాట్ లోనూ 50 మంది పర్యాటకులను అనుమతిస్తారు. రాత్రి వేళ సందర్శనకు సంబంధించిన టిక్కెట్లను ఒక రోజు ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆదివారాల్లో మాత్రం లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఇది పర్యాటకులకు ఒకింత కష్టంగా మారింది. లాక్ డౌన్ ఎత్తేసి..ఆంక్షలు తొలగిస్తే తప్ప..పూర్వవైభవం రావటం కష్టమే అని చెబుతున్నారు.