Telugu Gateway
Top Stories

కల నెరవేరింది అంటున్న సోహైల్

కల నెరవేరింది అంటున్న సోహైల్
X

తెలుగు బిగ్ బాస్ 4 సీజన్ లో సయ్యద్ సోహైల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ సీజన్ తర్వాత సోహైల్ బిజీ అయిపోయాడు. తాజాగా సోహైల్ ఎంజీ కారు కొనుగోలు చేశాడు. కారుతో పాటు తన తండ్రి, సోదరుడితో కలసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ...'చివరకు నా కల నెరవేరింది. కొత్త కారు కొనుగోలు చేశాను' అంటూ పేర్కొన్నాడు. ఈ కల నెరవెరేందుకు సహకరించిన బిగ్ బాస్ కు ధన్యవాదాలు తెలిపాడు. తన తండ్రే ఎప్పుడూ తనకు స్పూర్తి అని ఆ పోస్టులో పేర్కొన్నాడు.

Next Story
Share it