Telugu Gateway
Top Stories

టీఆర్ఎస్ కు స్వామిగౌడ్ షాక్

టీఆర్ఎస్ కు స్వామిగౌడ్ షాక్
X

రెండేళ్లలో వంద సార్లు కెసీఆర్ అపాయింట్ మెంట్ అడిగా

అయినా పిలుపురాలేదు

ఆత్మగౌరవం కోసమే పార్టీ మారా..పదవుల కోసం కాదు

జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు అధికార టీఆర్ఎస్ కు షాక్. శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఆయన బుధవారం నాడు ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా సమక్షంలో బిజెపిలో చేరారు. గత కొంత కాలంగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఆయన పలుమార్లు బహిరంగంగానే తన అసమ్మతిని తెలియజేశారు. బిజెపిలో చేరిన అనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లలో తాను ఓ వంద సార్లు సీఎం కెసీఆర్ అపాయింట్ మెంట్ కోరానని..కానీ ఇప్పటివరకూ తనకు పిలుపురాలేదన్నారు. అసలు జెండా మోయని..తెలంగాణ కోసం ఏ మాత్రం పని చేయని వారిని లోపల పెట్టుకుని..తెలంగాణ కోసం కృషి చేసిన తమ లాంటి వారందరినీ బయట కూర్చోబెట్టారని ఆరోపించారు.

ఇప్పటికైనా సీఎం కెసీఆర్ తన నిర్ణయాలను ఆలోచించుకోవాలన్నారు. బిజెపిలో చేరటం మాతృసంస్థకు వచ్చినట్లు భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఉద్యమకారులను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మాత్రం అగ్రతాంబూలం ఇచ్చారన్నారు. ఇటీవలే తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ స్వామిగౌడ్ పార్టీ మారరని,టీఆర్ఎస్ లో ఉంటారని ప్రకటించారు ఆయన ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే స్వామిగౌడ్ బిజెపిలో చేరటం విశేషం.

Next Story
Share it