Telugu Gateway
Top Stories

ఏపీ సర్కారుపై సుప్రీం ఆగ్ర‌హం

ఏపీ సర్కారుపై సుప్రీం ఆగ్ర‌హం
X

ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్షల వ్య‌వ‌హారంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దేశంలోని ప‌లు రాష్ట్రాలు ఇప్ప‌టికే ప‌రీక్షలు ర‌ద్దు చేశాయి. సీబీఎస్ఈ కూడా ప‌రీక్షలు ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఏపీ స‌ర్కారు ప‌ద‌వ త‌ర‌గ‌తితోపాటు ఇంట‌ర్ ప‌రీక్షల‌ను క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాక జ‌ర‌పాల‌ని యోచిస్తోంది. ఈ దిశ‌గానే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటోంది. ఈ ప‌రీక్షల అంశంపై మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు

ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణపై అఫిడవిట్‌ వేయలేదని, రెండు రోజుల్లో దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.ఏపీని ఎందుకు మినహాయించాలో చెప్పాలని ప్ర‌శ్నించింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్రమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. 11వ తరగతి పరీక్షలను సెప్టెంబర్‌లో జరుపుతామని కేరళ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఏపీ నుంచి స్పష్టత లేదని అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఇన్ని రోజులైనా అఫిడవిట్‌ ఎందుకు వేయలేదని ప్రభుత్వ న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆగ్ర‌హం నేప‌థ్యంలో ఏపీ స‌ర్కారు తీసుకుంటుంద‌నేది ఇప్పుడు కీల‌కంగా మారింది.

Next Story
Share it