Telugu Gateway
Top Stories

ఒక్కో వ‌య‌స్సు వారికి..ఒక్కో వ్యాక్సినేష‌న్ విధాన‌మా?

ఒక్కో  వ‌య‌స్సు వారికి..ఒక్కో వ్యాక్సినేష‌న్ విధాన‌మా?
X

కేంద్ర వ్యాక్సినేష‌న్ విదానంపై సుప్రీం కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. విధాన నిర్ణ‌యాల్లో కోర్టుల జోక్యం త‌గ‌దంటూ కేంద్రం చేసిన వాద‌న‌పై ఘాటుగా స్పందించింది. కార్య‌నిర్వాహ‌క విధానాల వ‌ల్ల పౌరుల రాజ్యాంగ హ‌క్కుల‌కు భంగం క‌లిగిన‌ప్పుడు ఖ‌చ్చితంగా జోక్యం చేసుకుంటామ‌ని తేల్చిచెప్పింది. తొలుత రెండు డోసులు ఉచితంగా వేసి..త‌ర్వాత కొంత మందిని ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో కొనుక్కొని వేసుకోవ‌చ్చ‌ని అనుమ‌తించ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించింది. తొలుత కేంద్ర‌మే వ్యాక్సిన్ల ను స‌ర‌ఫ‌రా చేసి..త‌ర్వాత రాష్ట్రాల‌ను కొనుగోలు చేయ‌మ‌ని చెప్ప‌టం కూడా స‌రికాద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఒక్కో వ‌య‌స్సు వారికి వ్యాక్సినేష‌న్ లో ఒక్కో విధానం ఉంటుందా అని ప్ర‌శ్నించింది. కేంద్రం తీరు ఏ మాత్రం స‌రిగాలేద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. వ్యాక్సినేష‌న్ విధానంలో చాలా లోపాలు ఉన్నాయ‌ని వాటిని వెంట‌నే స‌రిచేసుకోవాల‌ని సూచించింది.

కోవిడ్‌-19 వ్యాక్సిన్ల కొనుగోళ్లపై బుధవారం సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సిన్‌ కొనుగోళ్ల పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని కేంద్రానికి తెలిపింది. టీకాలు వేసిన జనాభా శాతం( సింగిల్‌, డబుల్‌ డోసులు) డేటాను ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు టీకాలు వేసుకున్న జనాభా శాతాన్ని తెలపాలని కేంద్రానికి స్పష్టం చేసింది. గ‌త కొన్ని రోజుల నుంచి కేంద్రం ఈ ఏడాది డిసెంబ‌ర్ నాటికి దేశంలో అంద‌రికీ వ్యాక్సినేష‌న్ పూర్తి చేస్తామ‌ని చెబుతోంది. ఈ త‌రుణంలో దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను కూడా కోర్టు ముందు ఉంచాల‌ని ఆదేశించారు. ప్ర‌స్తుత ద‌శ‌లో వ్యాక్సినేష‌న్ అత్యంత కీల‌కం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Next Story
Share it