Telugu Gateway
Top Stories

కరోనా నియంత్రణకు జాతీయ విధానం అవసరం

కరోనా నియంత్రణకు జాతీయ విధానం అవసరం
X

కేంద్రం తీరుపై సుప్రీం ఆగ్రహం

దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. మరో వైపు కరోనా బాధితులకు బెడ్స్ దొరకటంలేదు. కొన్ని చోట్ల మందుల సమస్య కూడా వెంటాడుతోంది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు సుమోటాగా ఈ కేసు విచారణకు స్వీకరించింది. అదే సమయంలో కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మనం జాతీయ అత్యయిక పరిస్థితిలో ఉన్నామని పేర్కొన్న ప్రధాన న్యామయూర్తి బోబ్డే నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం.. శుక్రవారంలోగా కరోనాకు సంబంధించిన జాతీయ విధానం రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఆక్సిజన్‌, మందులు, వ్యాక్సినేషన్‌ వంటి కరోనా అత్యవసరాల సరాఫరాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

కరోనా కట్టడికి సంసిద్ధత ప్రణాళిక సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రాలకు మినీ లాక్‌డౌన్‌ ప్రకటించే అధికారం ఇవ్వాలని స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ విధించే హక్కు రాష్ట్రాలకే ఉండాలని, ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాని పేర్కొంది. ఓ వైపు దేశంలో ఎక్కడాలేని విధంగా కొత్త కేసులు నమోదు అవుతున్నా రాజకీయ నేతలు మాత్రం భారీ ర్యాలీలతోఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల ఎన్నికలకు కరోనాకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. ఆయన అందుకు మహారాష్ట్రలో కరోనా కేసుల పెరుగుదల ఉదాహరణగా చూపారు.

Next Story
Share it