Telugu Gateway
Top Stories

రైతుల ఆందోళనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

రైతుల ఆందోళనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
X

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం నడుస్తోంది. ఈ అంశంపై దేశంలోనే హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కార్పొరేట్లకు మేలు చేసేలా ఉన్న ఈ చట్టాలు రద్దు చేయాల్సిందే అని రైతు సంఘాలు పట్టుపడుతుంటే ..కేంద్రం మాత్రం సవరణలు చేస్తాం కానీ రద్దు కుదరదని తేల్చిచెబుతోంది. ఈ తరుణంలో బుధవారం నాడు సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్లపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల ఆందోళన జాతీయ సమస్యగా మారే అవకాశం ఉందని సుప్రీంకోర్టు పడింది.

రైతుల ఆందోళనకు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని కోర్టు వెల్లడించింది. ఢిల్లీ వాసి రిషబ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ పై కీలక ఆదేశాలు జారీ చేసిన చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బొబ్డే ధర్మాసనం. వివాద పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులతో కమిటీ వేస్తామని తెలిపిన న్యాయస్థానం. ఆందోళన చేస్తోన్న రైతు సంఘాలను పార్టీలుగా ఇంప్లీడ్ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి. కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం. గురువారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం. తదుపరి విచారణను వాయిదా వేశారు.

Next Story
Share it