Telugu Gateway
Top Stories

మార్కెట్లు భారీగా పతనం

మార్కెట్లు భారీగా పతనం
X

ఊహించినట్లుగానే గురువారం నాడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఓపెన్ అయిన వెంటనే బిఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు వరసగా 1264 పాయింట్లు, 211 పాయింట్ల మేర పతనం అయ్యాయి. తర్వాత ప్రారంభ నష్టాల నుంచి కొంత కోలుకున్నా కూడా ఇంకా భారీ నష్టాలతోనే ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయేమో అన్న భయం మార్కెట్లను వెంటాడుతోంది. ప్రదానం గా ఇటీవల చోటుచేసుకున్న ఇరాన్-ఇజ్రాయిల్ ఘర్షణలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ కారణంగా రాబోయే రోజుల్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది అనే భయం కూడా వ్యక్తం అవుతోంది.

ఇన్వెస్టర్లు కూడా ప్రస్తుతం ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. మరి కొన్ని రోజుల్లోనే రెండవ త్రైమాసిక ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాలతో పాటు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పడితే మళ్ళీ మార్కెట్లు గాడిన పడే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు కొంత మంది ఇండియా పై ఫోకస్ తగ్గించి చైనా వైపు వెళుతున్నారు.దీనికి ప్రధాన కారణం ఆ దేశం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ తో చైనా మార్కెట్లు మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది అని లెక్కలు వేసుకోవటమే.

Next Story
Share it