స్టాక్ మార్కెట్లో బడ్జెట్ జోష్
సామాన్య, మధ్య తరగతి వర్గాలకు ఏ మాత్రం ఊరట కల్పించని ఈ బడ్జెట్ స్టాక్ మార్కెట్ ను మాత్రం మెప్పించింది. దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు కేంద్ర బడ్జెట్ పై సానుకూలంగానే స్పందించారు. అందుకు అనుగుణంగా మార్కెట్లు కూడా కదలాడాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన ఫిబ్రవరి 1న కాస్త ఊగిసలాడిన మార్కెట్..ముగింపు కూడా లాభాలతోనే చేసింది. బడ్జెట్ మరుసటి రోజున అంటే ఫిబ్రవరి2న మాత్రం ప్రారంభం నుంచి లాభాల బాటలోనే సాగుతోంది.
ఉదయం 9.45 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 450 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. . ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా అదే జోరులో ఉంది. ఈ బడ్జెట్ లో మౌలికసదుపాయాల రంగంతోపాటు డిజిటలైజేషన్ పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. సహజంగా ఇలాంటివి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలాంశాలే. బడ్జెట్ లో భారీ మెరుపులు లేకపోయినా...వాతలు కూడా లేకపోవటం ఎక్కువ మందికి ఊరట కల్పించే విషయంగా ఉంది.