ప్రారంభంలోనే కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
BY Admin20 Dec 2021 9:58 AM IST
X
Admin20 Dec 2021 9:58 AM IST
స్టాక్ మార్కెట్లో కల్లోలం. సోమవారం ప్రారంభంలోనే బీఎస్ ఈ సెన్సెక్స్ ఏకంగా వెయ్యి పాయింట్ల మేర నష్టపోయింది. పలు ప్రధాన షేర్లు అన్నీ నష్టాల్లోనే ట్రే్డ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు కూడా నష్టాలతో ముగియటం ఒకెత్తు అయితే..ఒమిక్రాన్ భయాల కారణంగా చాలా మంది లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, మెటల్స్ విభాగాల షేర్లు భారీ నష్టాల మూటకట్టుకున్నాయి. వీటితోపాటు మార్కెట్లో అత్యధిక వెయిటేజ్ ఉన్న రిలయన్స్, ఎస్ బిఐ షేర్లు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా వడ్డీ రేట్ల పెరుగుదల కూడా ప్రతికూల సంకేతాలు పంపుతున్నాయి.
Next Story