రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.8 లక్షల క్లెయిమ్‌ల పరిష్కారం

దేశంలోని ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో స్టార్ హెల్త్ ఒకటి. ఈ సంస్థ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో తమ కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తూ క్లెయిమ్స్ పరిష్కారం విషయంలో కూడా ఎంతో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్ది అని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆనంద్ రాయ్ వెల్లడించారు. ఆయన మంగళవారం నాడు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో క్లెయిమ్‌ల చెల్లింపులు 24 శాతం పెరగడం అనేది ప్రజల్లో ఆరోగ్య బీమా పట్ల పెరుగుతున్న అవగాహనకు నిదర్శనం అని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో 1.8 లక్షల క్లెయిమ్‌ల ద్వారా రూ.1,254 కోట్లు చెల్లించడం కేవలం వృద్ధి మాత్రమే కాదు, తమపై ప్రజలకు ఉన్న నమ్మకం. కుటుంబాల ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక భద్రత, దీర్ఘకాలిక సంక్షేమ ప్రణాళికల్లో ఆరోగ్య బీమా కీలకంగా మారిన నేపథ్యంలో తాము క్లెయిమ్‌ల ప్రక్రియను మరింత వేగవంతంగా, సరళంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాం అని తెలిపారు.
ఆస్పత్రుల భాగస్వామ్యం, అపార సర్వీసింగ్ సామర్థ్యాలు, దేశవ్యాప్తంగా 15,000కు పైగా ఆస్పత్రుల నెట్‌వర్క్ దన్నుతో, సాంకేతికత, మానవీయ విలువలతో ప్రతి కుటుంబానికి విశ్వసనీయమైన, అర్థవంతమైన విధంగా ఆరోగ్య బీమాను అందుబాటులోకి తెస్తున్నాం అని పేర్కొన్నారు. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ ప్రారంభమైనప్పటి నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఇప్పటి వరకు రూ. 6,064 కోట్లకు పైగా విలువ చేసే 9.6 లక్షల క్లెయిమ్‌ల పరిష్కారం చేసినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో చూస్తే, స్టార్ హెల్త్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 30.6 లక్షల క్లెయిమ్‌లకు సంబంధించి రూ. 11,903 కోట్లను పరిష్కరించింది. కంపెనీ స్థాపించినప్పటి నుండి దేశవ్యాప్తంగా రూ.67,800 కోట్లకు పైగా విలువ చేసే 1.5 కోట్లకు పైచిలుకు క్లెయిమ్‌లను సెటిల్ చేసింది. రిటైల్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి 92%గా ఉండగా, 84 శాతం క్లెయిమ్‌లు క్యాష్‌లెస్‌గా సెటిల్ చేయబడగా, అందులో 92% క్యాష్‌లెస్ క్లెయిమ్‌లు మూడు గంటలలోపే ప్రాసెస్ చేయబడటం విశేషం అని వెల్లడించారు.



