Telugu Gateway
Top Stories

'స్పైస్ మనీ' నుంచి జీరో పెట్టుబడి వ్యాపార కార్యక్రమం

స్పైస్ మనీ నుంచి జీరో పెట్టుబడి వ్యాపార కార్యక్రమం
X

దేశంలోని ప్రముఖ గ్రామీణ ఫిన్ టెక్ సంస్థ 'స్పైస్ మనీ' కొత్త పథకంతో ముందుకొచ్చింది. గ్రామీణ ప్రాంతంలోని ఎంటర్ ప్రెన్యూర్స్ ఎలాంటి పెట్టుబడి లేకుండా ఇందులో భాగస్వామిగా చేరవచ్చు. వీరు పూర్తి ఉచితంగా ఇందులో చేరే అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. పరిమిత కాలం ఉండే జీరో పెట్టుబడి కార్యక్రమం ద్వారా కోటి మంది గ్రామీణ వ్యవస్థాపకులను డిజిటల్, ఆర్ధికంగా శక్తివంతం చేయాలన్నదే స్పైస్ మనీ లక్ష్యంగా పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కంపెనీ డిజిటల్ చెల్లింపులను ఈ వ్యవస్థ బలోపేతం చేయనుంది. జీరో ఇన్వెస్ట్ మెంట్ ప్రవేశ కార్యక్రమం ద్వారా వలస కార్మికులు, కిరాణా స్టోర్ యాజమానులు, ఉద్యోగార్ధులు, కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు, గృహిణులు స్పైస్ మనీ అధికారి నెట్ వర్క్ లో భాగస్వాములు కావటంతోపాటు స్వీయ ఉపాధికి భరోసాను పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.

తమ సొంత పట్టణాల్లో దీని ద్వారా జీవనోపాధి అవకాశాలను పొందే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం స్పైస్ మనీ నెట్ వర్క్ లో ఉన్న ఐదు లక్షల మంది అధికారీల నెట్ వర్క్ లో 65 శాతం పైగా 30 సంవత్సరాల లోపు వారే అని తెలిపారు. దీనిపై స్పైస్ మనీ వ్యవస్థాపకుడు దిలీప్ మోడీ మాట్లాడుతూ జీరో ఇన్వెస్ట్ మెంట్ ఎంట్రీ కార్యక్రమం పట్టణ, గ్రామీణ భారతదేశంలోని యువతను ఎలాంటి ఖర్చు లేకుండా స్పైస్ మనీ అధికారులుగా మారేందుకు ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కంపెనీకి ప్రముఖ నటుడు సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

Next Story
Share it