Telugu Gateway
Top Stories

వ్యాక్సిన్ సరఫరా కోసం స్పైస్ జెట్ ప్రత్యేక విమానాలు

వ్యాక్సిన్ సరఫరా కోసం స్పైస్ జెట్ ప్రత్యేక విమానాలు
X

అంతర్జాతీయంగా కరోనా వ్యాక్సిన్ కు వేగంగా అనుమతులు వస్తున్నాయి. ఈ తరుణంలో వీటి సరఫరా కూడా కీలకం కానుంది. వ్యాక్సిన్ సరఫరాకు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పలు వ్యాక్సిన్లను ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో సరఫరా చేయాల్సి ఉంటుంది. దీని కోసం స్పైస్ జెట్ కు సంబంధించిన ప్రత్యేక కార్గో సంస్థ 'స్పైస్ ఎక్స్ ప్రెస్' దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యాక్సిన్ల సరఫరాకు రెడీ అయింది. స్పైస్ ఎక్స్ ప్రెస్ దీని కోసం ప్రత్యేకంగా స్పైస్ ఫార్మా ప్రో పేరుతో ప్రత్యేక సర్వీసులు ప్రారంభించింది.

మైనస్ 40డిగ్రీల సెల్సియస్ నుంచి 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ఈ వ్యాక్సిన్ ను జాగ్రత్తగా నిల్వచేయాల్సి ఉంటుంది. స్పైస్ ఎక్స్ ప్రెస్ అంతర్జాతీయంగా పలు కోల్డ్ చైన్ సొల్యూషన్స్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. అత్యంత సున్నితమైన డ్రగ్స్ ను, నియంత్రిత వాతావరణంలో సరఫరా చేయటంలో తాము సామర్ధ్యం కలిగి ఉన్నట్లు స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ వెల్లడించారు. స్పైస్ ఎక్స్ ప్రెస్ 17 సరుకు రవాణా ఎయిర్ క్రాఫ్ట్ లను కలిగి ఉంది.

Next Story
Share it