మెదడును తినే అమీబాతో వ్యక్తి మృతి

ఒక వైపు కరోనా వార్తలు మరో సారి ప్రపంచాన్ని భయపెడుతున్న వేళ దక్షిణ కొరియా సంచలన విషయాన్ని బయట పెట్టింది. అదేంటి అంటే ఆ దేశంలో ఒక అరుదైన వైరస్ కేసు నమోదు అయింది. మెదడును తినే అమీబా వల్ల 50 ఏళ్ళు ఉన్న వ్యక్తి ఒకరు ఆ దేశంలో చని పోయారు. అక్కడ నమోదు అయిన తొలి కేసు ఇదే. అయితే ఇలాంటి కేసు లు గతంలో కూడా ఉన్నాయి. కొరియా వ్యాధుల నియంత్రణ, నివారణ ఏజెన్సీ (కెడీసిఏ) ఈ విషయాన్ని నిర్ధారించింది. థాయిలాండ్ నుంచి వెనక్కి వచ్చిన పది రోజుల తరువాత అరుదైన లక్షణాలతో ఆ వ్యక్తి మరణించాడని తెలిపారు.
ఇలాంటి కేసులు మొదట 1937 లో అమెరికా లో నమోదు అయ్యాయి. నెగ్లెరియా -ఫంఓలేరు గా పిలిచే ఈ వైరస్ నదులు, చెరువులు, కాలువల్లో ఉంటుంది అని తెలిపారు. ఇది ముక్కు ద్వారా లోపలి ప్రవేశించి మెదడును తినేస్తుంది. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందదని తెలిపారు.2018 లో అమెరికా తో పాటు భారత్, థాయిలాండ్ ల్లో మొత్తం 381 కేసులు నమోదు అయ్యాయి.



