Telugu Gateway
Top Stories

ఎల‌క్ట్రిక్ కార్ల మార్కెట్లోకి సోనీ

ఎల‌క్ట్రిక్ కార్ల మార్కెట్లోకి సోనీ
X

జ‌పాన్ కు చెందిన ప్ర‌ముఖ సంస్థ సోనీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఎల‌క్ట్రిక్ కార్లు, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల గురించే చ‌ర్చ సాగుతోంది. దీనికి పెరుగుతున్న ఇంథ‌న వ్య‌యాలు ఓ కార‌ణం అయితే...ప్ర‌పంచాన్ని కాలుష్యం బారినుంచి కాపాడ‌టానికి ఇదొక్క‌టే మార్గం అని భావిస్తున్నారు. దేశంలోని దిగ్గ‌జ ఆటోమొబైల్ సంస్థ‌లు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల దిశ‌గా చాలా ముందడుగు వేశాయి. ఎల‌క్ట్రిక్ కార్ల త‌యారీ రంగంలోకి అడుగుపెట్టేందుకు వీలుగా సోనీ కార్పొరేష‌న్ తాజాగా సోనీ మొబిలిటీ పేరుతో కొత్త కంపెనీని ప్రారంభించింది. ఈ విష‌యాన్ని కంపెనీ సీఈవో కెనిచ్రో యోషిదా వెల్ల‌డించారు. సోనీ ఓ వైపు ఎంట‌ర్ టైన్ మెంట్ రంగంలో త‌న స‌త్తా చాటుతూనే మొబిలిటీ రంగంలోనూ ప్ర‌వేశించి కొత్త దారులు చూపిస్తామ‌ని పేర్కొన్నారు.

Next Story
Share it