Telugu Gateway
Top Stories

సోనూసూద్ కు కరోనా పాజిటివ్

సోనూసూద్ కు కరోనా పాజిటివ్
X

తొలి దశ కరోనా సమయంలో విస్తృతంగా సేవలు అందించి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న నటుడు సోనూ సూద్. ఇప్పుడు సోనూ సూద్ కూడా కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. శనివారం ఉదయం తనకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్ లోకి వెళ్లినట్లు తెలిపారు.

అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని..మీ సమస్యలు తీర్చేందుకు తనకు తగినంత సమయం దొరికిందని పేర్కొంటూ ఈ సమయంలో ఏమి చేయనున్నాడో చెప్పకనే చెప్పారు. ఇటీవలే ఆయన ఆచార్య సినిమాలో పాల్గొనేందుకు సైకిల్ పై వెళుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. అంతలోనే కరోనా పాజిటివ్ అని తేలింది.

Next Story
Share it