Telugu Gateway
Top Stories

ట్రావెల్ యూనియ‌న్ స‌ర్వీసులు ప్రారంభించిన సోనూసూద్

ట్రావెల్ యూనియ‌న్ స‌ర్వీసులు ప్రారంభించిన సోనూసూద్
X

దేశ వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతంలోని ట్రావెల్ ఏజెంట్ల‌ను ఒకే చోట‌కు చేర్చి వారికి అత్యుత్త‌మ సేవ‌లు అందించేందుకు ట్రావెల్ యూనియ‌న్ రెడీ అయింది. ఈ ట్రావెల్ టెక్ స్టార్ట‌ప్ ను ప్ర‌ముఖ న‌టుడు, సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు అందిస్తూ అంద‌రి నోట ప్ర‌శంసలు అందుకుంటున్న సోనూసూద్ ప్రారంభించారు. అన్ని ర‌కాల ట్రావెల్ సేవ‌ల‌కు ఇది ఒక వేదిక‌గా ఉప‌యోగ‌ప‌డ‌నుంద‌ని సోనూసూద్ వెల్ల‌డించారు. ఆయ‌న శుక్ర‌వారం నాడు ఈ యాప్ ను ప్రారంభించారు. ట్రావెల్ యూనియ‌న్ విమాన స‌ర్వీసుల‌తోపాటు రైల్వేలు, హోట‌ల్స్, ట్రిప్స్ త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి అత్యుత్త‌మ, చౌక ధ‌ర‌ల‌తో సేవ‌లందిస్తుంద‌ని తెలిపారు. వెంట‌నే టిక్కెట్ల ర‌ద్దు, రిఫండ్స్ వంటి సౌక‌ర్యాలు కూడా ఉంటాయ‌ని తెలిపారు. స‌హ‌జంగా క‌స్ట‌మ‌ర్ల దీని కోసం పెద్ద‌గా వేచిచూడాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌న్నారు. చిరు వ్యాపార యజమానులకు మద్దతు అందిచేందుకు భారతదేశపు మొట్టమొదటి గ్రామీణ బీ2బీ ట్రావెల్‌ టెక్‌ వేదిక ట్రావెల్‌ యూనియన్‌ను సోనూసూద్ అందుబాటులోకి తెచ్చారు.నూరు కోట్ల భారత ప్రజలకు సేవలనందించేందుకు గ్రామీణ భారతదేశంలో సుప్రసిద్ధ ట్రావెల్‌ ఏజెంట్‌ వ్యాపార కమ్యూనిటీని నిర్మించడంతో పాటుగా డిజిటల్‌ శక్తిని ట్రావెల్‌ యూనియన్‌ అందించనుంద‌న్నారు. జీరో పెట్టుబడితో గ్రామీణ భారతదేశంలో అగ్రశ్రేణి ట్రావెల్‌ ఏజెంట్‌ వ్యాపార కమ్యూనిటీ నిర్మించడం ద్వారా డిజిటల్‌ సాధికారిత అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ట్రావెల్‌ యూనియన్‌, అతిపెద్ద గ్రామీణ డిజిటల్‌ ట్రావెల్‌ సేవా వేదికగా వంద కోట్ల భారత ప్రజలకు సేవలనందించనుంది.

గ్రామీణ స్థాయిలో, ట్రావెల్‌ రంగం అధికంగా అసంఘటితంగా ఉంది.ఏ ఒక్కరూ భారతదేశపు టియర్‌ 2 పట్టణాలు, గ్రామాల అవసరాలపై దృష్టి సారించడం లేదు. ప్రధానంగా గ్రామీణ ట్రావెల్‌ కోసం ట్రావెల్‌ టెక్‌ ప్లాట్‌ఫామ్స్‌ లేకపోవడం చేత ట్రావెల్‌ యూనియన్‌, బహుళ నెరవేరని గ్రామీణ ట్రావెల్‌ ఏజెంట్స్‌ , చిరు వ్యాపార యజమానులు మరియు వ్యాపార సంస్థల అవసరాలను ఇది తీర్చనుంది. వీరిని ట్రావెల్‌ యూనియన్‌ మెంబర్స్‌గా వ్యవహరిస్తార‌న్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌, భారతదేశంలో నడుస్తున్న అన్ని రైళ్లకూ యాక్సస్‌ను ఐఆర్‌సీటీసీ ద్వారా అందించడంతో పాటుగా 500కు పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు, 10వేలకుపైగా బస్‌ ఆపరేటర్లు, 10 లక్షలకు పైగా హోటల్స్‌ను తమ సభ్యులు, వినియోగదారులకు అందిస్తుంది. ట్రావెల్‌ యునియన్‌, ప్రస్తుత ట్రావెల్‌ ఏజెంట్ల ఆదాయం, వృద్ధి అవకాశాలను సైతం మెరుగుపరచడంతో పాటుగా చిరు వ్యాపారులకు స్థిరంగా అదనపు ఆదాయ మార్గాలను సైతం అందిస్తుంది. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు నూతన వ్యాపార అవకాశాలను అందించడం తో పాటుగా గ్రామీణ వినియోగదారులకు సహాయపడేందుకు ఆధారపడతగిన ట్రావెల్‌ యూనియన్‌ సభ్యులు (ట్రావెల్‌ ఏజెంట్లు)తో కూడిన నెట్‌వర్క్‌ను సైతం సృష్టిస్తుంది.

Next Story
Share it