Telugu Gateway
Top Stories

సోనాలిక ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు వచ్చేశాయ్

సోనాలిక ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు వచ్చేశాయ్
X

వాహనాలు అన్నీ ఎలక్ట్రిక్ బాట పడుతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులతోపాటు ద్విచక్ర వాహనాలు కూడా వచ్చాయి. కార్లకు సంబంధించి కూడా త్వరలోనే మార్కెట్లోకి ఎలక్ట్రానిక్ మోడళ్ళు రాబోతున్నాయి. ఇఫ్పుడు దేశంలోనే తొలిసారి సోనాలిక ట్రాక్టర్స్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ను విడుదల చేసింది. టైగర్‌ పేరుతో అందిస్తున్న ఈ ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ ధర రూ.5.99 లక్షలు(ఎక్స్‌ షోరూమ్‌) అని సోనాలిక ట్రాక్టర్స్‌ తెలిపింది. ఈ ట్రాక్టర్‌ను 25.5 కేడబ్ల్యూ నేచురల్‌ కూలింగ్‌ కాంపాక్ట్‌ బ్యాటరీతో రూపొందించారు.

నిర్వహణ వ్యయాలు చాలా తక్కువగా (డీజిల్‌ ట్రాక్టర్ల వ్యయాలతో పోల్చితే నాలుగో వంతు)ఉంటాయని సోనాలిక గ్రూప్‌ ఈడీ రామన్‌ మిట్టల్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ గరిష్ట వేగం గంటకు 24.93 కి.మీ. అని, ఒక్కసారి బ్యాటరీని చార్జింగ్‌ చేస్తే ఎనిమిది గంటల పాటు ఈ ట్రాక్టర్‌ పనిచేస్తుందని మిట్టల్‌ వివరించారు. నాలుగు గంటల్లోనే పూర్తిగా చార్జింగ్‌ చేసే ఫాస్ట్‌ చార్జింగ్‌ సిస్టమ్‌ను కూడా ఆఫర్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ టైగర్‌ ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ను యూరప్‌లో డిజైన్‌ చేశామని, పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో తయారు చేశామన్నారు.

Next Story
Share it