మళ్ళీ ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా !

ప్రజల తిరుగుబాటుతో అంతటి చైనా కూడా జీరో కోవిడ్ విధానానికి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. అయితే ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచాన్ని మరో సారి ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఎప్పుడు అయితే చైనా జీరో కోవిడ్ కు బ్రేకులు వేసిందో అప్పటినుంచి ఆ దేశంలో ఈ కేసు లు భారీగా పెరుగుతున్నాయి వచ్చే 90 రోజుల్లో చైనా లోని 60 శాతం ప్రజలు కోవిడ్ బారిన పడే ప్రమాదం ఉందని అమెరికా కు చెందిన ప్రముఖ వైద్య రంగ నిపుణుడు ఎరిక్ ఫీజిల్ డింగ్ వెల్లడించారు. ప్రస్తుతం చైనా లో పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతుండటంతో ఆస్పత్రులు ఖాళీ లేవని చెపుతున్నారు. మరణాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని నివేదికలు వస్తున్నాయి. కాకపోతే ప్రభుత్వ అధికారిక లెక్కలు మాత్రం చాలా నామమాత్రంగానే ఉన్నట్లు చూపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి పూర్తి స్థాయిలో బయట పడుతున్న ప్రపంచానికి చైనా వార్తలు ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశాలే.
ఒక్క చైనాలోనే కాదు...ఇక్కడ పరిస్థితి కారణంగా ఇతర దేశాల్లో కూడా ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.కొద్దిరోజుల క్రితం చైనాలో కోవిడ్ కు అడ్డుకట్ట వేయటానికి వాడిన వాక్సిన్లు ఏ మాత్రం సరైనవి కావని వార్తలు వచ్చాయి. అయితే భారత్ లోని నిపుణులు మాత్రం దేశంలో వాక్సినేషన్ పూర్తి అవ్వటం..హెర్డ్ ఇమ్మ్యూనిటి తదితర అంశాల కారణంగా ఇబ్బంది ఏమి ఉండదు అని చెపుతున్నారు. అక్కడక్కడా కేసు లు నమోదు అయిన ప్రాణాపాయం ఉందని వీళ్ళు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే వాక్సిన్లు తయారు అయినందున ఇందులో కావాల్సిన మార్పులు చేసుకోవటం కూడా పెద్ద కష్టం కాదని..దీనికి ఏక్కువ సమయం కూడా పట్టదని ఈ రంగంలోని వాళ్ళు చెపుతున్న మాట. కాకపోతే చైనా వార్తలు మాత్రం మరో సారి ప్రపంచాన్ని భయంలోకి నెట్టాయని చెప్పొచ్చు.