Telugu Gateway

మూడున్నర లక్షలు దాటిన కరోనా కేసులు

మూడున్నర లక్షలు దాటిన కరోనా కేసులు
X

భారతదేశంలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గటం లేదు. రోజుకో కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా ఏకంగా 3,52,991 కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులో ఇంత భారీ ఎత్తున కేసులు నమోదు అవటం ప్రపంచంలో ఒక్క భారత్ లోనే జరిగింది. అదే సమయంలో ఒక్క రోజులోనే 2812 మంది కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. అయితే కరోనా నుంచి రికవరీ అయిన వారు 2,19,272 మంది ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఇఫ్పటివరకూ నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 1,73,13,163కు చేరగా, మొత్తం రికవరీలు 1,43, 04,382 మందిగా ఉంది.

దేశ వ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకూ 1,95,123 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 28,13,658 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఊహించని స్థాయిలో పెరుగుతున్న ఈ కేసులతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్క..ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు ఈ వైరస్ బారినపడిన వారు. దేశంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి.

Next Story
Share it