Telugu Gateway
Top Stories

వూట్ కిడ్స్ తో సింగ‌పూర్ టూరిజం భాగ‌స్వామ్యం

వూట్ కిడ్స్ తో సింగ‌పూర్ టూరిజం భాగ‌స్వామ్యం
X

వ‌యాకామ్ 18కి చెందిన వూట్ కిడ్స్ గ్రీన్ గోల్డ్ యానిమేష‌న‌న్ తో సింగ‌పూర్ టూరిజం బోర్డు (ఎస్ టిబి) ఒప్పందం చేసుకుంది.భారతీయ ప్రేక్షకులను వర్చువల్‌గా సింగపూర్‌లో ప్రతిష్టాత్మక భారతీయ కామిక్‌ క్యారెక్టర్‌ చోటా భీమ్‌తో కలిసి సాహసాలను చేసేందుకు తీసుకువెళ్లబోతుంది. 'చోటా భీమ్‌– అడ్వెంచర్స్‌ ఇన్‌ సింగపూర్‌' శీర్షికన రూపొందించిన ఈ సిరీస్‌ ద్వారా సింగపూర్‌లోని పలు ప్రాంతాలను ప్రేక్షకులకు అతి సన్నిహితంగా సృజనాత్మక ఫార్మాట్‌లో తీసుకురావడంతో పాటుగా వేసవి సెలవులు లేదా తమను తాము సురక్షితంగా ఉంచుకునేందుకు ఇళ్లలోనే విద్యనభ్యసిస్తోన్న భారతదేశ వ్యాప్తంగా కుటుంబాలు మరియు చిన్నారులతో కల‌వ‌నుంది. ఎస్‌టీబీ, గ్రీన్‌గోల్డ్‌ యానిమేషన్‌తో ఈ భాగస్వామ్యం మరింతగా తమ కంటెంట్‌ లైబ్రరీని బలోపేతం చేసుకోవడంతో పాటుగా భారతదేశపు అభిమాన క్యారెక్టర్లకు ఏకీకృత కేంద్రంగా నిలువనుంది. ఈ జూలై 17తో ఆరంభించి ఈ మినీ సిరీస్‌ భారతదేశ వ్యాప్తంగా చిన్నారులకు ఆంగ్లం, హిందీ మరియు తమిళ భాషలలో వినోదం అందించనుంది. ఈ వెబ్‌ సిరీస్‌, ఇప్పుడు ఎక్కువ మంది అభిమానించే వ్యక్తి భీమ్‌కు 11 వ పుట్టిన రోజు వేడుకగా కూడా నిలుస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చోటా భీమ్‌ మరియు అతని స్నేహితులు అతని పుట్టిన రోజును సింగపూర్‌లో వేడుక చేయడంతో పాటుగా వినోదాత్మక కార్యక్రమాలలో మునిగితేలుతారు. ప్రతి ఎపిసోడ్‌, ప్రేక్షకులకు సింగపూర్‌లో విభిన్న అనుభవాలను అందిస్తుంది. దీనిలో యాక్షన్‌ మరియు ఎడ్వెంచర్‌ నుంచి షాపింగ్‌ మరియు ఫుడ్‌ వరకూ ఎన్నో సౌకర్యవంతంగా తమ ఇళ్ల నుంచే వారు ఆస్వాదించవచ్చ‌ని సింగ‌పూర్ టూరిజం బోర్డు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఏడు ప్రత్యేక కథలతో ఈ మరుపురాని ట్రిప్‌ యొక్క పులకరింతలు, చిందులు సింగపూర్‌ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో చూపుతారు.

చోటా భీమ్‌ మరియు అతని స్నేహితులు అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతాలు అయినటువంటి జ్యూవెల్‌ చాంగీ ఎయిర్‌పోర్ట్ , దాని ప్రాచుర్యం పొందిన హెచ్‌ఎస్‌బీసీ రెయిన్‌ వొర్టెక్స్‌, సింగపూర్‌ బొటానిక్‌ గార్డెన్స్‌, సింగపూర్‌ జూ, నైట్‌ సఫారీ వంటివి ప్రదర్శిస్తారు. ఈ సిరీస్‌లో నగరం యొక్క ఆకర్షణీయమైన స్కైలైన్‌, ఫ్రేమ్డ్‌ బై మరీనా బే శాండ్స్‌ ఇంటిగ్రేటెడ్‌ రిసార్ట్‌తో పాటుగా ప్రతిష్టాత్మక మైలురాళ్లు అయినటువంటి సింగపూర్‌ ఫ్లైయర్‌ మరియు గార్డెన్స్‌ బై ద బే వంటివి సైతం చూడవచ్చు. భీమ్‌ మరియు అతని స్నేహితులు, ఐల్యాండ్‌ సిటీ వీధులలో తిరగడంతో పాటుగా దీని యొక్క వైవిధ్యమైన ప్రాంగణాలు మరియు శబ్దాల గురించి మాట్లాడతారు. వీటితో పాటుగా చవులూరించే రెస్టారెంట్లు మరియు క్యుసిన్‌లుసైతం చూపనున్నారు. ఈ వినూత్నమైన భాగస్వామ్యం గురించి జీబీ శ్రీథర్‌, డైరెక్టర్‌, ఇండియా, మిడిల్‌ ఈస్ట్‌ అండ్‌ సౌత్‌ ఆసియా (ఐఎంఈఎస్‌ఏ), సింగపూర్‌ టూరిజం బోర్డ్‌ మాట్లాడుతూ ''మా వరకూ, ఈ ప్రాజెక్ట్‌ ద్వారా భారతదేశవ్యాప్తంగా చిన్నారులు మరియు వారి తల్లిదండ్రుల మోములపై ఈ ఒత్తిడి సమయంలో చిరునవ్వులు పూయించడం లక్ష్యం చేసుకున్నాం. అమితంగా ఆదరించబడిన క్యారెక్టర్లు చోటాభీమ్‌ మరియు అతని స్నేహితులు. వీరి ఆనందం, ఆశ మరియు ఆశావాదంను భారతీయ ప్రేక్షకులకు తీసుకురానున్నారు. మా గిఫ్ట్‌ ఆఫ్‌ స్మైల్స్‌గా ఏడు ఎపిసోడ్స్‌ను భారతీయ ప్రేక్షకులకు సమర్పిస్తుండటం పట్ల ఎస్‌టీబీ ఆనందంగా ఉంది. ఈ ఎపిసోడ్స్‌ ఫ్యామిలీలకు ఆనందం కలిగించడంతో పాటుగా సింగపూర్‌ అనుభవాలను ఇంటిలో ఉండి వర్చువల్‌గా సురక్షితంగా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాం'' అని అన్నారు.

Next Story
Share it