Telugu Gateway
Top Stories

ఇండియా పాస్ పోర్టు ర్యాంక్ ఎంతో తెలుసా?

ఇండియా పాస్ పోర్టు ర్యాంక్  ఎంతో తెలుసా?
X

జపాన్ ను వెనక్కి నెట్టి సింగపూర్ పాస్ పోర్టు ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా అవతరించింది. ఐదేళ్ల పాటు వరసగా మొదటి స్థానంలో ఉంటూ వచ్చిన జపాన్ పాస్ పోర్టు ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయింది. సింగపూర్ పాస్ పోర్ట్ తో వీసా లేకుండానే 192 దేశాలు తిరిగి రావొచ్చు. హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించారు. తాజా జాబితా ప్రకారం సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టు గా నిలిస్తే రెండవ ప్లేస్ లో జర్మనీ, ఇటలీ , స్పెయిన్ లు, మూడవ ప్లేస్ లో ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జపాన్, లక్సెంబోర్గ్, దక్షిణ కొరియా, స్వీడన్ లు మూడవ ప్లేస్ లో, నాల్గవ స్థానంలో డెన్మార్క్, ఐర్లాండ్, నెథర్లాండ్స్, యునైటెడ్ కింగ్డమ్ లు ఉన్నాయి.

ఐదవ ప్లేస్ లో బెల్జియం, చెక్ రిపబ్లిక్, మాల్టా, న్యూజిలాండ్, నార్వే, పోర్చుగల్, స్విట్జర్లాండ్ లు ఉన్నాయి. రెండవ ప్లేస్ లో ఉన్న దేశాల పాస్ పోర్ట్ లు కలిగిన వాళ్ళు వీసా లేకుండా 190 దేశాలు తిరిగిరావొచ్చు. అగ్రరాజ్యం అమెరికా పాస్ పోర్ట్ ర్యాంక్ ఎనిమిదవ ప్లేస్ లో ఉంది. ఇండియా పాస్ పోర్ట్ ర్యాంక్ 80 గా ఉంది. ఇండియా పాస్ పోర్టు తో 57 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించే వెసులు బాటు ఉంది. ప్రతి ఏటా ఈ హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ ద్వారా ర్యాంకింగ్ లు విడుదల చేస్తారు అనే విషయం తెలిసిందే.

Next Story
Share it