Telugu Gateway
Top Stories

ఫైజర్ వ్యాక్సిన్ కు సింగపూర్ అనుమతి

ఫైజర్ వ్యాక్సిన్ కు సింగపూర్ అనుమతి
X

ప్రపంచంలోని పలు దేశాలు వరస పెట్టి ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో సింగపూర్ కూడా చేరింది. తాజాగా సింగపూర్ దేశంలో ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది. దీంతో ఆసియాలో ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన దేశంగా సింగపూర్ నిలిచింది. డిసెంబర్ నెలాఖరు నుంచే సింగపూర్ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సింగపూర్ లోని 57 లక్షల మందికి ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ తెలిపారు. 2021 మూడవ త్రైమాసికానికి సింగపూర్ లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

తాను కూడా వ్యాక్సిన్ తీసుకోనున్నట్లు ప్రధాని తెలిపారు. స్వచ్చందంగా ముందుకు వచ్చేవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. అయితే తొలుత వైద్య సిబ్బందికి, వృద్ధులకు ప్రాధాయతన ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఫైజర్ తో పాటు మోడెర్నాతో కూడా సింగపూర్ ఒప్పందాలు చేసుకుంది. అన్ని అనుమతులు వచ్చాక మోడెర్నా వ్యాక్సిన్ కూడా సింగపూర్ లో అందుబాటులోకి రానుంది.

Next Story
Share it