Telugu Gateway
Top Stories

సిలికాన్ వ్యాలీకి కీలక సంస్థలు గుడ్ బై

సిలికాన్ వ్యాలీకి కీలక సంస్థలు గుడ్ బై
X

సిలికాన్ వ్యాలీ. ఈ పేరు ఎంతో పాపులర్ అన్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని టెక్ దిగ్గజాలు అన్నీ కొలువై ఉన్న ప్రాంతం. ఇప్పుడు ఆ ప్రాంతంపై దిగ్గజ సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయ. పన్నుల విధానంపై తీవ్ర అసంతృప్తితో ఆ ప్రాంతానికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించాయి. సిలికాన్ వ్యాలీ నుంచి హెవ్లెట్ ప్యాకార్డ్, ఒరాకిల్, ప్లాంటీర్ తదితర సంస్థలు వెళ్లిపోనున్నాయి.

క్యాలిఫోర్నియా రాష్ట్రంలో నిర్వహణ తీరుతోపాటు అధిక ఆదాయ పన్ను రేట్లను బిలియనీర్లు తప్పుపట్టారు. టెస్లాకు చెందిన ఎలన్ మస్క్ తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపర్చారు. ఒకప్పుడు వెలుగు వెలిగిన సిలికాన్ వ్యాలీ ఇప్పుడు తన ప్రభను కోల్పోతుందనే విమర్శలు విన్పిస్తున్నాయి. దీనికి స్థానిక యంత్రాంగం తీరు అని పారిశ్రామిక దిగ్గజ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

Next Story
Share it