సీఎస్ కె ఫ్యాన్స్ కు ధోనీ షాక్
BY Admin24 March 2022 3:19 PM IST

X
Admin24 March 2022 3:19 PM IST
మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చెన్నయ్ సూపర్‌కింగ్స్ కెప్టెన్ నదవి నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2022 త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో ధోనీ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ ఆటగాడిగా కొనసాగుతాడని జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ధోని స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సీఎస్‌కే కొత్త కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇందుకు సంబంధించి సీఎస్‌కే ఫ్రాంఛైజీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ధోని సారధ్యంలో చెన్నయ్ సూపర్ కింగ్స్ నాలుగుసార్లు ట్రోఫీని దక్కించుకుంది. ఐపీఎల్ ప్రారంభం అయిన 2008 సీజన్ నుంచి ధోనీనే సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.
Next Story



