Telugu Gateway
Top Stories

ఎయిర్ ఇండియా కు షాక్

ఎయిర్ ఇండియా కు షాక్
X

టాటాల చేతికి చేరిన ఎయిర్ ఇండియాకు ఊహించ‌ని షాక్. ఈ ఎయిర్ లైన్స్ కు పున‌ర్ వైభ‌వం తెచ్చేందుకు సంస్థ యాజ‌మాన్యం తీసుకున్న నిర్ణ‌యానికి ఎదురుదెబ్బ త‌గిలింది. ఎయిర్ ఇండియా కు కొత్త సీఈవోని అన్వేషించుకోవాల్సిన బాధ్య‌త టాటా గ్రూప్ పై ప‌డింది. అత్యంత కీల‌క‌మైన ఎయిర్ ఇండియా సీఈవోగా ఇల్క‌ర్ ఐసీని నియ‌మించిన‌ప్పుడే కేంద్రం నుంచి దీనికి అనుమ‌తి రావాల్సి ఉంద‌నే అభిప్రాయం వెల్ల‌డైంది. అన్ని విష‌యాలు ప‌రిశీలించిన త‌ర్వాత కానీ కేంద్రం ఈ నియామ‌కానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంద‌ని భావించారు. ఈ లోగానే ఇల్క‌ర్ ఐసీ నియామ‌కంపై ప‌లు అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. ఈ వార్త‌లు మీడియాలో ప్ర‌ముఖంగా రావ‌టంతో ఆయ‌నే ఈ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌రాద‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఇదే విష‌యాన్ని టాటా గ్రూప్ న‌కు తెలియ‌జేశారు.ఎయిరిండియాకు తిరిగి పున‌ర్ వైభ‌వం తెచ్చేందుకు టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కి సీఈవోగా పని చేస్తున్న టర్కీ జాతీయుడు ఇల్క‌ర్ ఐసీని సీఈవోగా నియమించాలని నిర్ణయించింది. 2014లో టర్కీష్‌ ఎయిర్‌లైన్స్‌లో చేరిన ఐసీ 2022 జనవరి 31 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఏప్రిల్‌ 1 నుంచి ఎయిరిండియా సీఈవోగా పదవీ బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగింది. ఎయిరిండియా లాంటి సంస్థకు విదేశీ వ్యక్తిని సీఈవోగా నియమించడంపై ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందిన సద్వేశీ జాగరణ్‌ మంచ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నియమకాన్ని తప్పు పడుతూ విమర్శలు ఎ‍క్కుపెట్టింది. దేశీయ కంపెనీలకు విదేశీ వ్యక్తులను సీఈవోగా నియమించే ముందు గ‌త చ‌రిత్ర ప‌రిశీల‌న చేయాల్సి ఉంటుంది.

Next Story
Share it