Telugu Gateway
Top Stories

హాట్ టాపిక్ గా షారుఖ్ ఖాన్ ఐదు కోట్ల రూపాయల వాచ్

హాట్ టాపిక్ గా షారుఖ్ ఖాన్ ఐదు కోట్ల రూపాయల వాచ్
X

ప్రపంచంలోని సంపన్న హీరోల్లో షారుఖ్ ఖాన్ నాల్గవ వ్యక్తి. ఈ బాలీవుడ్ హీరో హాలీవుడ్ హీరోలతోనే పోటీ పడుతున్నారు తప్ప...భారత్ లో ఆయనకు దగ్గరలో కూడా ఎవరూ లేనట్లు లెక్కలు చెపుతున్నాయి. ఎందుకంటే అయన మొత్తం ఆస్తుల విలువ 6142 కోట్ల రూపాయలుగా లెక్కగట్టారు. ఒక్కో సినిమాకు షారుక్ ఖాన్ వంద నుంచి 120 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని అంచనా. తాజాగా అయన నటించిన పఠాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపటం తో అయన రెట్టించిన ఉత్సహంతో తదుపరి ప్రాజెక్టులకు రెడీ అవుతున్నారు.

తాజాగా షారుఖ్ ఖాన్ ఒక ఈవెంట్ లో ఐదు కోట్ల రూపాయల వాచ్ పెట్టుకుని కనిపించారు. . ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. హీరోయిన్ దీపికా పదుకొనె విడుదల చేసిన వీడియో లో ఇది కనిపించింది. ఆ వాచ్ ఆడేమర్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ వాచ్ అని టాక్. దీని ఖరీదు 4 98 కోట్ల రూపాయలు అట. షారుఖ్ ఖాన్ కు భారత్ తో పాటు దుబాయ్ లో కూడా విలాసవంతమైన నివాసాలు ఉన్న విషయం తెలిసిందే.

Next Story
Share it