Telugu Gateway
Top Stories

విదేశాల నుంచి వ‌స్తే వారం ఇంట్లోనే

విదేశాల నుంచి వ‌స్తే వారం ఇంట్లోనే
X

భార‌త్ లోనూ కొత్త క‌రోనా కేసులు ల‌క్షల సంఖ్య‌లో న‌మోదు అవుతుండ‌టంతో కేంద్రం మ‌రిన్ని చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. ముఖ్యంగా విదేశీ ప్ర‌యాణికుల విష‌యంలో కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అమ‌ల్లోకి తెచ్చింది. కొత్త‌గా అమ‌ల్లోకి వ‌చ్చిన ఈ మార్గ‌ద‌ర్శ‌కాలు జ‌న‌వ‌రి 11 నంచి అమ‌ల్లోకి రానున్నాయి. ఇందులో ప్ర‌ధాన‌మైన‌ది విదేశాల నుంచి అంటే ముఖ్యంగా రిస్క్ ఎక్కువ ఉన్న దేశాల‌తోపాటు ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చిన వారు కూడా విధిగా వారం రోజులు క్వారంటైన్ లో ఉండాలి. ఆ వారం గ‌డువు ముగిసిన త‌ర్వాత క‌రోనా ప‌రీక్షలు చేయించుకుని ఫ‌లితం ఆధారంగా బ‌య‌ట‌కు రావాల‌ని పేర్కొన్నారు. ఒమిక్రాన్ కేసుల‌తోపాటు మొత్తం మీద క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్న దేశాల‌ను ఈ జాబితాలో ప్ర‌స్తావించారు.

విదేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులు ఈ మేర‌కు ఎయిర్ సువిధా సెల్ఫ్ డిక్ల‌రేష‌న్ ఫారం ఇవ్వాల్సి ఉంటుంద‌ని తాజా మార్గ‌ద‌ర్శ‌కాల్లో తెలిపారు. అంతే కాదు త‌మ ప్ర‌యాణానికి 72 గంట‌ల క‌రోనా ప‌రీక్ష చేయించుకుని నెగిటివ్ ఉంటేనే విమానాల్లో అనుమ‌తించాల‌న్నారు. ఈ మేర‌కు ఎయిర్ లైన్స్ అన్నీ కూడా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని ఆదేశించారు. ముప్పు దేశాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు విమానాశ్ర‌యంలో ప‌రీక్షలు ఉంటాయ‌నే విష‌యాన్ని ప్ర‌యాణికులకు తెల‌పాల‌న్నారు.

క్ష

Next Story
Share it