Telugu Gateway
Top Stories

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర..రాష్ట్రాలకు 400 రూపాయలు

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర..రాష్ట్రాలకు 400 రూపాయలు
X

ప్రైవేట్ ఆస్పత్రులకు మాత్రం 600 రూపాయలు

విదేశీ వ్యాక్సిన్ల కంటే చాలా చౌక

సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయల లెక్కన, ప్రైవేట్ ఆస్పత్రులకు 600 రూపాయల ధరతో విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకూ వ్యాక్సిన్ సరఫరా అంతా కేంద్రం చేతిలో ఉండగా..తాజాగా చేసిన మార్పుల్లో 50 శాతం మాత్రం కేంద్రం తీసుకుని..మిగిలిన వ్యాక్సిన్లను రాష్ట్రాలకు,ప్రైవేట్ సంస్థలకు విక్రయించుకోవటానికి అనుమతించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే సీరమ్ ఇప్పుడు ధరలు వెల్లడించింది. రాబోయే రెండు నెలల్లో వ్యాక్సిన్ తయారీ సామర్ధ్యాన్ని పెంచే పనిలో ఉండనున్నట్లు తెలిపారు.

ప్రపంచంలోని ఇతర వ్యాక్సిన్ల ధరలతో పోలిస్తే తమ ధర తక్కువే అంటూ పోలికను కూడా వెల్లడించింది కంపెనీ. అమెరికా వ్యాక్సిన్లు 1500 రూపాయలు ఉంటే, రష్యా,చైనాల వ్యాక్సిన్ల ధర 750 రూపాయలుగా ఉన్నాయని వెల్లడించారు. వ్యాక్సిన్ సరఫరాలో ఉన్న సంక్లిష్టతల దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు రాష్ట్రం ఏర్పాటు చేసిన వ్యవస్ధ ద్వారా కొనుగోలుకు ప్రయత్నించాలని సీరమ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా సూచించారు.

Next Story
Share it