Telugu Gateway
Top Stories

భారత్ లో కొత్త రాయబారిని నియమించిన డోనాల్డ్ ట్రంప్

భారత్ లో  కొత్త రాయబారిని నియమించిన డోనాల్డ్ ట్రంప్
X

ఇప్పుడు అందరి దృష్ఠి ఆయనపైనే . ఎవరీ సెర్గియో గోర్ అని. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తాజాగా సెర్గియో గోర్ ను ఇండియాలో అమెరికా రాయబారిగా నియమించారు. గత కొంత కాలంగా డోనాల్డ్ ట్రంప్ ఇండియా విషయంలో కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో భారత ప్రధాని మోడీ తనకు ఎంతో మంచి స్నేహితుడు అంటూ చెపుతూ వచ్చిన ఆయన తర్వాత సుంకాల విషయంలో భారత్ పై దూకుడు చూపిస్తున్న విషయం తెలిసిందే. తొలుత రెండు దేశాల మధ్య బిగ్ డీల్ కుదరనుంది అని చెప్పిన ఆయన తొలుత 25 శాతం...తర్వాత రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు అని చెప్పి మరో 25 శాతం కలిపి మొత్తం భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అదనపు సుంకాలు ఆగస్ట్ 27 నుంచో అమల్లోకి రానున్నాయి. వీటి విషయంలో ఇప్పుడు ఏ మాత్రం వెనక్కి తగ్గే ఆలోచనలో కూడా డోనాల్డ్ ట్రంప్ సర్కారు ఉన్నట్లు కనిపించటం లేదు. ఈ తరుణంలో తనకు ఎంతో సన్నిహితుడు, నమ్మకస్తుడు అయిన సెర్గియో గోర్ ను భారత్ లో అమెరికా రాయబారిగా నియమించారు.

ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి ఇదే సెర్గియో గోర్ ను ప్రపంచ నంబర్ వన్ సంపన్నుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొద్ది నెలల క్రితమే పాము గా అభివర్ణించారు. ఎలాన్ మస్క్ ట్రంప్ సర్కార్ లో కొద్ది నెలల పాటు డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ డిపార్ట్మెంట్ (డోజ్) అధినేత గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డోనాల్డ్ ట్రంప్ -ఎలాన్ మస్క్ ల మధ్య దూరం పెరగటానికి ఆయన కారణం అయ్యాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ 38 సంవత్సరాల వయస్సు ఉన్న సెర్గియో గోర్ డోనాల్డ్ ట్రంప్ కు సన్నిహితుడే కాకుండా..మొన్నటి ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం ఎంతో కృషి చేశారు కూడా. ఈ నియామకాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ప్రకటించారు. ‘సెర్గియో గోర్‌ను భారత్‌కు రాయబారిగా, దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధిగా ఎంపిక చేశాను’ అని పేర్కొన్నారు. మీడియాలో ఎక్కువగా కనిపించని సెర్గియో గోర్‌‌‌కు పార్టీ వర్గాల్లో పవర్ ఫుల్ నేతగా పేరుంది.

ప్రభుత్వంలో ట్రంప్ మద్దతుదారులను తీసుకోవడంలో ముఖ్య పాత్ర పోషించిన సెర్గియో సుమారు 4 వేల మంది నియామకంలో కీలకంగా వ్యవహరించారు. సంప్రదాయ దౌత్యవేత్తలను చాలా వరకూ పక్కనపెట్టేశారు. తన కోర్ టీం లోని వాళ్లనే కీలక స్థానాల్లో నియమిస్తున్నారు. ప్రస్తుతం సెర్గియో గోర్ వైట్ హౌస్ లో పర్సనల్ డైరెక్టర్ గా ఉన్నారు. తన బెస్ట్ సెల్లింగ్ బుక్స్ ఆయనే పబ్లిషర్ అని ట్రంప్ వెల్లడించారు. తన అజెండాను అమలు చేయటానికి...దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దటంలో తనకు ఒక విశ్వసనీయ వ్యక్తి కావాలి అని..సెర్గియో గొప్ప రాయబారి అవుతారు..ఆయనకు నా అభినందనలు అంటూ పోస్ట్ పెట్టారు ట్రంప్.

Next Story
Share it