Telugu Gateway
Top Stories

కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయం

కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక నిర్ణయం
X

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండవ దశకు చేరుతుంది. తొలుత కేవలం ఫ్రంట్ లైన్ వర్కర్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వృద్ధులతోపాటు..దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మార్చి 1 నుంచే ప్రారంభం కానుంది. ఈ దశలో అరవై సంవత్సరాలు దాటిన వారితోపాటు దీర్ఘకాల వ్యాధులు ఉన్న 45 సంవత్సరాలు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు.

దేశంలో మొత్తం పది వేల కేంద్రాల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.. మరో 20 వేల ప్రైవేట్ కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రైవేట్ కేంద్రాల్లో పంపిణీ చేసే వ్యాక్సిన్ ధరను త్వరలోనే నిర్ణయించనున్నట్లు మంత్రి తెలిపారు. రెండవ దశలో 27 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశంలో ఇఫ్పటికే 1.21 లక్షల మందికిపైగా వ్యాక్సిన్ ఇచ్చారు. దేశంలో సీరమ్ తోపాటు భారత్ బయోటెక్ కు చెందిన కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్ ల అత్యవసర వినియోగానికి కేంద్రం ఆమోదం ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story
Share it