Telugu Gateway
Top Stories

గృహకొనుగోలుదారులకు ఎస్ బి ఐ గుడ్ న్యూస్

గృహకొనుగోలుదారులకు ఎస్ బి ఐ గుడ్ న్యూస్
X

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బిఐ) గృహ కొనుగోలుదారులకు శుభవార్త అందించింది. మార్చి 31లోగా కొత్త రుణాలు తీసుకునే వారికి రుణాలపై వడ్డీ రేట్లను పది బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ వడ్డీ రేట్లు 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. రుణ మొత్తంపై సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా వడ్డీ రేట్లు వర్తిస్తాయని పేర్కొంది. 75 లక్షల రూపాయల వరకు రుణాలపై 6.70 శాతం వడ్డీ, 75 లక్షల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు రుణ మొత్తంపై 6.75 శాతం వడ్డీ వర్తిస్తుందని పేర్కొంది.

ప్రాసెసింగ్‌ ఫీజుపైనా నూరు శాతం రాయితీ అందిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా హోమ్‌ లోన్‌ తీసుకుంటే మరో 5 బేసిస్‌ పాయింట్ల అదనపు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రుణ గ్రహీతలకు అదనంగా మరో 5 బేసిస్‌ పాయింట్ల రాయితీని అందిస్తున్నట్లు పేర్కొంది. ఎస్‌బీఐ బ్యాంకు గృహ రుణ పోర్ట్‌ ఫోలియో ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయల మైలురాయిని దాటింది. 31 డిసెంబర్ 2020 నాటికి బ్యాంక్ 35 లక్షల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్ బేస్ కలిగి ఉందని తెలిపారు.

Next Story
Share it