Telugu Gateway
Top Stories

తాకట్టు పెట్టిన బంగారం తస్కరించాడు

తాకట్టు పెట్టిన బంగారం తస్కరించాడు
X

బ్యాంకు లో డబ్బులు దాచుకోవటం ఎంతో సేఫ్ అనుకుంటాం. అలాగే చాలా మంది తమ బంగారం, నగలు కూడా బ్యాంకు లాకర్లలో అయితే సురక్షితంగా ఉంటాయనుకుంటారు. కానీ ఒక బ్యాంకు మేనేజర్ ఏకంగా లాకర్ లో పెట్టిన మూడు కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని దొంగతనం చేసి తాకట్టుపెట్టాడు. ఇది అంతా కూడా స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (ఎస్ బిఐ) ములందు బ్రాంచ్ లో జరిగింది. ముంబై ఎస్ బిఐ బ్రాంచ్ లో పని చేస్తున్న సర్వీస్ మేనేజర్ మనోజ్ మారుతి ఈ పని చేసినట్లు గుర్తించారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు సర్వీస్ మేనేజర్ ను అరెస్ట్ చేశారు. అయితే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్న మనోజ్ మారుతీ వారం రోజుల్లో ఆ బంగారం వెనక్కి ఇస్తానని చెప్పటం విశేషం.

ఈ మూడు కోట్ల విలువ చేసే బంగారాన్ని తాకట్టు పెట్టి కస్టమర్ అప్పు తీసుకున్నాడు. ఇలా అప్పు తీసుకోవటం కోసం తాకట్టు పెట్టిన బంగారం లాకర్ల తాళాలు ఇద్దరి దగ్గర ఉంటాయి. తన దగ్గర ఉన్న తాళంతోనే సర్వీస్ మేనేజర్ ఈ మొత్తం దొంగిలించాడు. సహజంగా ఏ కస్టమర్ బంగారాన్ని అయినా కూడా ఖాతాదారుతో పాటు బ్యాంకు అధికారుల సమక్షంలో సీల్డ్ కవర్ లో లాకర్ లో పెడతారు అని పోలీస్ లు వెల్లడించారు. గోల్డ్ లోన్స్ కు సంబంధించి తాకట్టు పెట్టిన బంగారం తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మూడు కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని తనఖా పెట్టుకుని ఈ ఎస్ బిఐ బ్రాంచ్ 1 .94 కోట్ల రూపాయల రుణం ఇచ్చింది.

Next Story
Share it