ఎస్ బిఐ ఆన్ లైన్ సేవలకు అంతరాయం
BY Admin20 May 2021 4:30 PM

X
Admin20 May 2021 4:30 PM
దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బి) కీలక ప్రకటన చేసింది. మూడు రోజుల పాటు బ్యాంకుకు చెందిన పలు ఆన్ లైన్ సేవలు పనిచేయవని తెలిపింది. మే 21 నుంచే ఇది అమల్లోకి రానుంది. మే 21, 22, 23 రోజులలో మెయింటెనెన్స్ కారణంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యూపీఐ వంటి సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ వెల్లడించింది.
మే 21న 22.45 గంటల నుంచి మే 22న 1.15 గంటల వరకు, అలాగే మే 23న 2.40 గంటల నుంచి 6.10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవు. ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా చెల్లింపులు ఏమైనా ఉంటే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది.
Next Story