Telugu Gateway
Top Stories

స‌ఫైర్ ఫుడ్స్ ఐపీవో న‌వంబ‌ర్ 9 నుంచి

స‌ఫైర్ ఫుడ్స్ ఐపీవో న‌వంబ‌ర్ 9 నుంచి
X

కెఎఫ్ సీ, పిజ్జాహ‌ట్ ఔట్ లెట్స్ ను నిర్వ‌హిస్తున్న స‌ఫైర్ ఫుడ్స్ ప‌బ్లిక్ ఇష్యూకు వ‌స్తోంది. మార్కెట్ నుంచి ఈ సంస్థ 2073 కోట్ల రూపాయ‌లు స‌మీక‌రించ‌నుంది. ఈ ఐపీవో న‌వంబ‌ర్ 9న ప్రారంభం కానుంది. 10 రూపాయలు ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌ ప్రైస్‌బ్యాండ్‌ 1120 రూపాయల నుంచి 1180 రూపాయలుగా నిర్ణ‌యించారు. న‌వంబర్ 09 న‌ప్రారంభం అయి నవంబర్ 11న ముగుస్తుంది. ఇన్వెస్ట‌ర్లు కనీసం 12 ఈక్వటీ షేర్లతో బిడ్‌ దాఖలు చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌లో భాగంగా 10 రూపాయల ముఖవిలువ కలిగిన 17,569,941 ఈక్విటీ షేర్లను అమ్మకానికి అందుబాటులో ఉంచుతారు. సెబీ మార్గ దర్శకాలకు లోబడి ఈ ఆఫర్‌ ఉంటుంది.

ఈ ఆఫర్‌లో భాగంగా 75%ను అర్హత కలిగిన సంస్ధాగత కొనుగోలుదారులు (క్యుఐబీలు)కు కేటాయిస్తారు. ఈ క్యుఐబీలో 60% వరకూ యాంకర్‌ ఇన్వెస్టర్లకు సైతం కేటాయించవచ్చు. ఈ యాంకర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ భాగంలో మూడవవంతు దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌కు అందుబాటులో ఉంచుతారు. అలాగే ఈ ఆఫర్‌లో 15% మించకుండా నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ బిడ్డర్లకు, 10 % మించకుండా రిటైల్‌ ఇండివిడ్యువల్‌ బిడ్డర్లకు కేటాయిస్తారు. ఈ షేర్లను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌ చేస్తారు.

Next Story
Share it