Telugu Gateway
Top Stories

చైనా నుంచి నోయిడాకు శాంసంగ్ యూనిట్

చైనా నుంచి నోయిడాకు శాంసంగ్ యూనిట్
X

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సంస్థ శాంసంగ్ చైనాలోని తన తయారీ యూనిట్ ను ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు తరలిస్తోంది. ఈ యూనిట్ లో కంపెనీ ఏకంగా 4800 కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టనుంది. మొబైల్,ఐటి డిస్ ప్లే యూనిట్ ను శాంసంగ్ చైనా నుంచి తరలిస్తోంది. ఈ యూనిట్ తరలింపులో భాగంగా కంపెనీకి 250 కోట్ల రూపాయల మేర స్టాంప్ డ్యూటీ మినహాయింపు కల్పించనున్నారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కింద కంపెనీ 460 కోట్ల రూపాయల మేర ఆర్ధిక రాయితీ కూడా పొందనుంది.

శాంసంగ్ కొత్త యూనిట్ ద్వారా 1500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ యూనిట్ కు కల్పించే రాయితీలపై నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నోయిడాలో శాంసంగ్ కు అతి పెద్ద మొబైల్ తయారీ యూనిట్ ఉంది. 2018లో ప్రధాని నరేంద్రమోడీ ఈ యూనిట్ ను ప్రారంభించారు.

Next Story
Share it