Telugu Gateway
Top Stories

రష్యా వీసా చాలా ఈజీ ఇప్పుడు

రష్యా వీసా చాలా ఈజీ ఇప్పుడు
X

పర్యాటకం పై రష్యా తిరిగి ఫోకస్ పెట్టింది. ఏడాది కాలంగా రష్యా --ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధం కారణంగా ఆ దేశానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య దారుణంగా పడిపోయింది. అంతే కాదు అగ్ర రాజ్యం అమెరికా తో పాటు పలు దేశాలు రష్యా పై పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. ఇంకా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం పూర్తి స్థాయిలో ఆగకపోయినా తీవ్రత తగ్గింది అనే చెప్పొచ్చు. అదే సమయంలో రష్యా కూడా తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టక పోతే మరిన్ని సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఆ దేశం కొత్త వీసా విధానం అమల్లోకి తెచ్చింది. అదేంటి అంటే హోటల్ రిజర్వేషన్ చూపిస్తే చాలు ఆరు నెలల పాటు చెల్లుబాటు అయ్యేలా వీసా మంజూరు చేస్తారు. ఈ సౌకర్యం భారత్ తో పాటు మొత్తం పందొమ్మిది దేశాలకు కల్పించారు.

ఇందులో ఇండియా తో పాటు బహ్రెయిన్, బ్రూనై, కంబోడియా, చైనా, ఇండోనేషియా, ఇరాన్, కొరియా, కువైట్, లావోస్, మలేసియా, మెక్సికో, ఒమాన్, థాయిలాండ్ వంటి దేశాలు ఉన్నాయి. ఏ దేశాల ప్రజలు రష్యా లోని హోటల్ రిజర్వేషన్ చూపించి ఆరు నెలల వీసా పొంద వచ్చు. దీంతో పాటు ఈ ఏడాది జూన్ నుంచి మొత్తం 70 దేశాలకు ఎలక్ట్రానిక్ వీసాలు జారీ ప్రక్రియను స్టార్ట్ చేసే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ప్రస్తుతం మాత్రం హోటల్ బుక్ చేసుకుంటే చాలు వీసా చాలా సులభంగా వచ్చేస్తుంది. కొన్ని దేశాలు అక్కడకు వెళ్ళాక కూడా వీసాలు మంజారు చేస్తాయి. అక్కడ కూడా ఇలానే ఎక్కడ స్టే చేసేది...ఎన్ని రోజులు ఉంటది వంటి వివరాలు అందచేయాల్సి ఉంటుంది.

Next Story
Share it